Presidential Elections : రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపుపై ఎమ్మెల్యే రఘునందన్, మంత్రి వేముల మధ్య ఆసక్తికర చర్చ

మా అభ్యర్థికి 396 కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని భావిస్తున్నాం అని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. దీనికి వెంటనే వేముల కౌంటర్ ఇచ్చారు. మీ బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేలలో ద్రౌపది ముర్ముకు ఒక్కరే ఓటేసి ఉంటారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.

Presidential Elections : రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపుపై ఎమ్మెల్యే రఘునందన్, మంత్రి వేముల మధ్య ఆసక్తికర చర్చ

Presidential Elections

Presidential Elections : రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. సోమ‌వారం జ‌రిగిన పోలింగ్‌లో 99 శాతం మంది స‌భ్యులు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నార‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం తెలిపింది. 11 రాష్ట్రాల్లో ఏకంగా 100 శాతం పోలింగ్ న‌మోదైనట్టు పేర్కొంది. ఈ మేర‌కు రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్‌పై సోమ‌వారం రాత్రి కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

కాగా.. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిశాక తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఇద్దరి మధ్య సరదా సంభాషణ నడిచింది. మా అభ్యర్థికి 396 కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని భావిస్తున్నాం అని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. దీనికి వెంటనే వేముల కౌంటర్ ఇచ్చారు. మీ బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేలలో ద్రౌపది ముర్ముకు ఒక్కరే ఓటేసి ఉంటారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. దీనికి స్పందించిన రఘునందన్.. 21న ఎన్నికల ఫలితాల్లో ఏం జరుగుతుందో చూద్దాం అని అన్నారు.

Presidential Elections: ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. 21న ఫలితాలు

బ్యాలెట్ బాక్స్ లు నేనే ఢిల్లీ తీసుకుపోదాం అని వెయిట్ చేస్తున్నా అని మంత్రి వేముల అనగా.. మీరు ఇక్కడ బయలుదేరినా మేమే ముందు వెళతాం, అక్కడ దిగనియ్యం అని రఘునందన్ రావ్ అన్నారు. టీఆర్ఎస్ ఓట్లు వృథా కాబోతున్నాయని, ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలవబోతోందని రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు.

MLA Seethakka : రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్‌లో ఎమ్మెల్యే సీతక్క కన్ఫ్యూజ్..తాను వేయాలనుకున్న అభ్యర్థికి కాకుండా మరో అభ్యర్థికి

దీనికి స్పందించిన మంత్రి వేముల.. గెలుపోటములు.. కౌంటింగ్ తర్వాత తెలుస్తాయి. టీఆర్ఎస్ ఓట్లు వృథానా? కాదా? అనేది కూడా తెలుస్తుందన్నారు. తెలంగాణలో క్రాస్ ఓటింగ్ జరిగిందని అనుకుంటున్నాం అని రఘునందన్ రావు అనగా.. బీజేపీకి ఉన్న మూడు ఓట్లలో ఒక ఓటు మాత్రమే మీకు పడిందని మేము కూడా అనుకుంటున్నాం అని వేముల అన్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన పోలింగ్ ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ముగిసింద‌ని ఎన్నిక‌ల సంఘం తెలిపింది. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో మొత్తం 4,796 మంది ఓట్లు వేయాల్సి ఉండ‌గా… వారిలో 99 శాతం మంది త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నార‌ని వెల్ల‌డించింది. ఈ సంద‌ర్భంగా పీపీఈ కిట్ల‌లో పోలింగ్ కేంద్రాల‌కు వ‌చ్చి త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్న ప్ర‌జా ప్ర‌తినిధుల ఫొటోల‌ను ఈసీ విడుద‌ల చేసింది. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్‌ను ఢిల్లీలోని పార్ల‌మెంటుతో పాటు ఆయా రాష్ట్రాల్లోని అసెంబ్లీలలో నిర్వ‌హించారు.