Priest cheating : సుమంగళి వ్రతాలు చేయిస్తానంటూ మహిళలకు పూజారి టోకరా..రూ.కోటిన్నర దోపిడీ

మీ భర్త ఆరోగ్యంగా..క్షేమంగా ఉండాలంటే సుమంగళి పూజలు చేయాలని నమ్మించిన ఓ పూజారి కొంతమంది మహిళలకు టోకరా ఇచ్చాడు. మీ భర్తలు క్షేమంగా ఉండటానికి వ్రతాలు చేయిస్తానని పలువురి మహిళల నుంచి పూజారి రూ.కోటిన్నర రూపాయలు వసూలు చేసి పరారయ్యాడు.

Priest cheating : సుమంగళి వ్రతాలు చేయిస్తానంటూ మహిళలకు పూజారి టోకరా..రూ.కోటిన్నర దోపిడీ

Priest Cheating

Nizamabad Priest cheating : మీ భర్త ఆరోగ్యంగా..క్షేమంగా ఉండాలంటే సుమంగళి పూజలు చేయాలని నమ్మించిన ఓ పూజారి కొంతమంది మహిళలకు టోకరా ఇచ్చాడు. తెలంగాణాలోని నిజమాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి, బోధన్, మాక్లూర్ లలో పలువురు మహిళలు పూజారి వలలో పడ్డారు. కోసం వ్రతాలు చేయిస్తానని పలువురి మహిళల నుంచి పూజారి రూ.కోటిన్నర రూపాయలు వసూలు చేసి పరారయ్యాడు. ఈ విషయం తెలిసిన మహిళలు మోసపోయామని గ్రహించి లబోదిబోమంటూ పోలీసులకు ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు పూజారి కోసం గాలిస్తున్నారు.

ఈ ఘటనపై డిచ్‌పల్లి ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ధర్మారం(బి) గ్రామంలో ఉన్న శ్రీమద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శ్రీనివాస్‌ శర్మ అనే వ్యక్తి కొంత కాలంగా పూజారిగా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో ఆలయానికి వచ్చే మహిళలకు మీ భర్తలు క్షేమంగా ఉండాలంటే వ్రతాలు చేయించుకోండి అంటూ చెబుతుండేవారు. దీంతో కొంతమంది మహిళలు వ్రతాలు చేయించుకుంటామని చెప్పారు. దాంతో వ్రతానికి పలు పూజా సామగ్రి కావాలని..వాటిని కొనటానికి పూజలు చేయించటానికి డబ్బులు ముందుగానే ఇవ్వాలని కండిషన్ పెట్టాడు పూజారి శ్రీనివాస్ శర్మ. అది నమ్మిక కొంతమంది మహిళలు కొంత డబ్బు ఇచ్చారు.

అలా డబ్బు ఇచ్చినవారిలో నిజామాబాద్‌ కంఠేశ్వర్‌ న్యూ హౌజింగ్‌ బోర్డు కాలనీలో ఖిల్లా రోడ్‌లో షాప్‌ నిర్వహించే కొత్త మాధవీలత కూడా ఉన్నారు. మాధవీలత భర్త గణేష్‌ పక్షవాతంతో మంచానపడ్డాడు. మనవరాలు కూడా కిడ్నీ సమస్యలతో బాధపడుతోంది. దీంతో మాధవీలత ధర్మారం(బి)లో ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాన్ని సందర్శించుకుంది. అలా అక్కడ అర్చకుడిగా పనిచేసే శ్రీనివాస్ శర్మకు తన బాధల్ని చెప్పుకుంది. నా భర్తకు అనారోగ్యం..మనుమరాలు కూడా కిడ్నీ సమస్యలతో బాధపడుతోందని చెప్పుకుంది. దీంతో సదరు పూజారి ‘మీ గ్రహస్థితి బాగలేదని..మీ భర్త ఆరోగ్యం తిరిగి రావాలన్నా..నీ మనుమరాలు ఆరోగ్యం కుదుట పడాలన్నీ శాంతి పూజలు చేయించాలని..నీ భర్త ఆరోగ్యం కోసం సుమంగళి వ్రతం చేయాలని చెప్పాడు.

వ్రతం చేసి..కొంత మంది భక్తులకు లడ్డూలతో భోజనాలు వడ్డిస్తే సమస్యలన్నీ తీరుతాయని నమ్మించాడు. మాయమాటలకు నమ్మిన మాధవీలత శ్రీనగర్‌లో రెండు ఎకరాల భూమి అమ్మగా వచ్చిన రూ.25 లక్షలను విడతల వారీగా దశల వారీగా పూజారికి ఇచ్చింది. ఆతరువాత వ్రతం చేయిచాలని పూజారిని ఎన్నిసార్లు అడిగినా ఏదొక కారణం చెప్పి వాయిదాలు వేస్తున్నాడు.దీంతో సదరు మహిళ మోసపోయానని గ్రహించింది. నెమ్మదిగా తన డబ్బులు రాబట్టుకోవాలని అనుకుంది. అలా తనకు డబ్బులు అవసరం అని..తన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగింది. కానీ దానికి పూజారి అదనీ ఇదనీ చెబుతూ వాయిదాలు వేస్తు..మే 29న కనిపించకుండాపోయాడు. తనలాగే ఇంకా కొందరు మహిళలు పూజారి శ్రీనివాస్ శర్మ వల్ల మోసపోయారని తెలుసుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాడని పూజారి శ్రీనివాస్ శర్మ గురించి గాలిస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.