PM Modi Meeting: విజయ సంకల్ప సభ భారీ కవరేజ్‌కు కమలనాథుల ప్లాన్

ప్రధాని నరేంద్రమోదీ పాల్గొనే విజయ సంకల్ప సభను పెద్దఎత్తున విజయవంతం చేసేందుకు బీజేపీ అధిష్టానం అన్ని చర్యలు చేపట్టింది. విజయ సంకల్ప సభకు భారీ కవరేజ్ అలభించేలా కమలనాథులు ప్లాన్ చేశారు.

PM Modi Meeting: విజయ సంకల్ప సభ భారీ కవరేజ్‌కు కమలనాథుల ప్లాన్

Modi Meeting

PM Modi Meeting: హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండవ రోజు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, బీజేపీ అగ్రనేతలు పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ బహిరంగ సభకు ప్రధాని మోదీ పాల్గోనున్నారు. ఈ మేరకు పరేడ్ గ్రౌండ్ వద్ద బహిరంగ సభకు ఐదు వేల మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటించే ప్రాంతాలు భద్రతా వలయంలోకి వెళ్లిపోయాయి.. మోదీ భద్రతను క్షణక్షణం ఎస్పీజీ పర్యవేక్షిస్తుంది. మోదీ పర్యటన ప్రాంతాల్లో నాలుగు అంచల భద్రతను ఏర్పాటు చేశారు.

PM Modi : హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని

ప్రధాని మోదీ చుట్టూ ఎస్పీజీ తోపాటు పటిష్టమైన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ టీమ్స్ నిరంతర నిఘా ఉంటున్నాయి. ప్రధాని పాల్గొనే కార్యక్రమాల పరిధిలోని ప్రాంతాలన్నీ స్నిప్పర్స్, క్విక్ రెస్పాన్స్ బృందాలు, మఫ్టీ పార్టీల నిఘా ఏర్పాటు చేశారు. సిటీ పోలీస్ తో ఎస్పీజీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. ప్రధాని బసచేసే ప్రాంతంలో 144సెక్షన్ అమల్లో ఉంది. డ్రోన్స్ ఎగిరివేతపై నిషేధం విధించారు. పరేడ్ గ్రౌండ్స్ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పరేడ్ గ్రౌండ్ ఫ్లై ఓవర్ ను పూర్తిగా క్లోజ్ చేశారు. చుట్టు పక్కల బిల్డింగ్స్ ను శనివారం నుండి ఎస్సీజీ తమ ఆధీనంలో తీసుకుంది. బేగంపేట్ విమానాశ్రయం, హెచ్ఐసిసి నోవెటెల్, పెరేడ్ గ్రౌండ్, రాజ్ భవన్ చుట్టూ అనుక్షణం పటిష్ఠ భద్రత ను ఏర్పాటు చేశారు.

Modi Meeting: భీమవరంలో మోదీ సభ సజావుగా సాగుతుంది: విష్ణు వర్ధన్ రెడ్డి

ఇదిలాఉంటే ప్రధాని  రేంద్రమోదీ పాల్గొనే విజయ సంకల్ప సభను పెద్దఎత్తున విజయవంతం చేసేందుకు బీజేపీ అధిష్టానం అన్ని చర్యలు చేపట్టింది. విజయ సంకల్ప సభకు భారీ కవరేజ్ అలభించేలా కమలనాథులు ప్లాన్ చేశారు. సభా ప్రాంగణంలో 18 హైడెఫినేషన్ కెమెరాలు, మరో రెండు జిమ్మీలు, గ్రౌండ్ పొడుగు ఎక్కువగా ఉండటంతో వేదిక పై ఉన్న వారిని దగ్గర చూసేలా 40 LED లు ఏర్పాటు చేశారు. సభకు రాలేని వారికోసం సోషల్ మీడియాలో విస్తృత ప్రసారానికి రంగం సిద్ధం చేశారు. ఫేస్ బుక్, యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా ప్రచారం చేసేందుకు చర్యలు చేపట్టారు. సోషల్ మీడియాలో జాతీయ వ్యాప్తంగా ట్రెండ్ అయ్యేల చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ట్విట్టర్ లో #BJP4NewTelangana అటూ ట్రెండింగ్ కు ప్లాన్ చేశారు.