Vande Bharat Train : నేడు తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ రైలు పరుగులు.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

నేడు తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభం కానుంది. సంక్రాంతి సందర్భంగా ఇవాళ ఈ సెమీ హైస్పీడ్ రైలును ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రారంభంకానుంది.

Vande Bharat Train : నేడు తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభం కానుంది. సంక్రాంతి సందర్భంగా ఇవాళ ఈ సెమీ హైస్పీడ్ రైలును ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రారంభంకానుంది. సికింద్రాబాద్ లో జరిగే ప్రారంభోత్స కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, జి.కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. ఇప్పటికే రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ హైదరాబాద్ కు వచ్చారు. కిషన్ రెడ్డితో కలిసి ఆయన రైలును పరిశీలించారు. అయితే ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ఈ రైలు ప్రజలకు అందుబాటులోకి రానుంది.  ఈ రైలు ఆదివారం మినహా మిగిలిన ఆరు రోజులు తిరుగుతుంది.

ఈ రైలు మార్గంమధ్యలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో ఆగనుంది. ఈ రైలును గంటకు 160 కి.మీ వేగంతో నడపనున్నారు. సికింద్రాబాద్- విశాఖ మధ్య ముూడున్నర గంటల సమయం ఆదా కానుంది. తొలి రోజు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి 21 స్టేషన్లలో ఆగనుంది. వందే భారత్ రైలు టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ప్రారంభోత్సవం సందర్భంగా ఈ రైలు ఇవాళ ఒక్క రోజు ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్-నుంచి ఈ రైలు బయలుదేరి రాత్రి 8.45 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది.

Vande Bharat Express: ఆదివారం మినహా మిగతా రోజుల్లో అందుబాటులో.. తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైలు టైమింగ్స్ ఇవే..

మార్గంమధ్యలో ఈ రైలు 21 స్టేషన్లలో ఆగనుంది. చర్లపల్లి, భువనగిరి, జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. అయితే ప్రారంభించిన తొలి రోజు మాత్రమే ఈ స్టేషన్లలో రైలు ఆగుతుంది. రేపటి నుంచి రెగ్యులర్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ రైలు 16వ తేదీ నుంచి ప్రయాణికులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది.

ఆదివారం మినహా వారంలో మిగిలిన ఆరు రోజులపాటు ఈ రైలు ప్రయాణికులకు సేవలు అందిస్తుంది.
రేపు విశాఖ నుంచి బయలుదేరే వందే భారత్ రైలు రైలు నెంబర్ (20833) ప్రతి రోజు ఉదయం 5:45 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2:15 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. కేవలం 8 గంటల్లో విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకోవచ్చు. ఇక తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో (రైలు నెంబర్ 20834) మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 11:30 గంటలకు విశాఖకు చేరుకుంటుంది.

Third VandeBharat train in the country: దేశంలో అందుబాటులోకి 3వ ‘వందే భారత్ రైలు’.. ప్రారంభించిన మోదీ 

ఈ రైలు మార్గంమధ్యలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. వందే భారత్ రైలులో మొత్తం 16 బోగీలు ఉంటాయి. వీటిలో 14 ఏసీ చైర్ కార్లు. రెండు బోగీలు ఎగ్జిక్యూటివ్ ఏసీ కారు కోచ్ లు. ఎగ్జిక్యూటివ్ ఏసీ కార్ కోచ్ లో 104 సీట్లు ఉంటాయి. ఇక ఎకానమీ క్లాస్ లో 1,024 సీట్లు ఉంటాయి. మొత్తంగా ఈ రైలులో ఒకేసారి 1,128 మంది ప్రయాణించవచ్చు. రైల్వే శాఖ టికెట్ ధరలు ఖరారు చేసింది. వెళ్లేటప్పుడు ఓ రేటు, వచ్చేటప్పుడు మరొక రేటు నిర్ణయించారు.

ఏసీ చైర్ కార్ ఛార్జీలు..
విశాఖ నుంచి సికింద్రాబాద్ వరకు రూ.1,720, విశాఖ నుంచి రాజమండ్రికి రూ.625,
విశాఖ నుంచి విజయవాడ జంక్షన్ రూ.960, విశాఖ నుంచి ఖమ్మం రూ.1,115, విశాఖ నుంచి
వరంగల్ రూ.1,310. సికింద్రాబాద్ నుంచి విశాఖ రూ.1,665, సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి రూ.1,365,
సికింద్రాబాద్ నుంచి విజయవాడ జంక్షన్ రూ.905, సికింద్రాబాద్ నుంచి ఖమ్మ రూ.750, సికింద్రాబాద్ నుంచి వరంగల్ రూ.520గా  రైల్వే శాఖ నిర్ణయించింది.

Vande Bharat Express: దక్షిణాదిన ప్రారంభం కానున్న తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఛార్జీ..
విశాఖ నుంచి సికింద్రాబాద్ రూ.3,170, విశాఖ నుంచి రాజమండ్రి రూ.1,215, విశాఖ నుంచి విజయవాడ జంక్షన్ రూ.1,825, విశాఖ నుంచి ఖమ్మం రూ.2,130. విశాఖ నుంచి వరంగల్ రూ.2,540.
సికింద్రాబాద్ నుంచి విశాఖ రూ.3,120, సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి రూ.2,485. సికింద్రాబాద్ నుంచివిజయవాడ జంక్షన్ రూ.1,775. సికింద్రాబాద్ నుంచి ఖమ్మం రూ.1,460. సికింద్రాబాద్ నుంచి వరంగల్ రూ.1,005గా టికెట్ ధరలను రైల్వే శాఖ నిర్ణయించింది.

ట్రెండింగ్ వార్తలు