Modi Telangana Tour : రాజకీయ ఆసక్తి రేపుతున్న ప్రధాని మోదీ తెలంగాణ టూర్

వారం రోజుల క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్‌ వచ్చారు. అంతకుముందు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా తెలంగాణలో పర్యటించారు. ఇక 20 రోజుల వ్యవధిలోనే మరో అగ్రనేత మోదీ హైదరాబాద్‌ రానుండడం పొలిటికల్‌గా ఉత్కంఠ రేపుతోంది.

Modi Telangana Tour : రాజకీయ ఆసక్తి రేపుతున్న ప్రధాని మోదీ తెలంగాణ టూర్

Pm Modi

PM Modi Telangana tour : ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన రాజకీయ ఆసక్తిని రేపుతోంది. ఆయన ISB కాన్వకేషన్‌లో పాల్గొనడానికి ఈనెల 26న ఉదయం హైదరాబాద్‌ రానున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఇవి రెగ్యులర్‌గా జరిగే అభివృద్ధి కార్యక్రమాలే అయినా తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు నడుస్తున్న సమయంలో ప్రధాని మోదీ పర్యటన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.

ఐఎస్ బీ కాన్వకేషన్‌ మధ్యాహ్నం జరగనుంది. ప్రధాని మాత్రం ఉదయాన్నే హైదరాబాద్‌ రానున్నారు. దీంతో కొన్ని గంటల పాటు ఆయన బీజేపీ నేతలతో సమావేశం అవుతారని తెలుస్తోంది. ఎయిర్‌పోర్ట్‌లోనే ప్రధాని తెలంగాణ బీజేపీ నేతలను కలవనున్నారు. తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు మోదీ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.

Bhatti Vikramarka : మోదీ ప్రధానిగా ఉండి ఉంటే తెలంగాణ వచ్చేదే కాదు-భట్టి విక్రమార్క

వారం రోజుల క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్‌ వచ్చారు. అంతకుముందు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా తెలంగాణలో పర్యటించారు. ఇక 20 రోజుల వ్యవధిలోనే మరో అగ్రనేత మోదీ హైదరాబాద్‌ రానుండడం పొలిటికల్‌గా ఉత్కంఠ రేపుతోంది. ఇటీవల బండి సంజయ్‌ ప్రజాసంగ్రామయాత్ర ముగిసిన సమయంలోనూ ప్రధాని ఆయనకు ఫోన్‌ చేసి మాట్లాడారు.

బాగా పోరాడుతున్నారని కితాబు ఇచ్చారు. ఇప్పుడు వారికి ప్రధాని ఏం దిశానిర్దేశం చేయబోతున్నారన్నది ఆసక్తిని రేపుతోంది.కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, టీఆర్ఎస్‌కు ఎలా కౌంటర్‌ ఇవ్వాలి, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఎలాంటి వ్యూహాలు అనుసరించాలన్నదానిపై దిశానిర్దేశం చేస్తారని స్థానిక బీజేపీ నేతలు చెబుతున్నారు.

Harish Rao fire On PM Modi : తెలంగాణ విభజనపై ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం..

మోదీ పర్యటనను విజయవంతం చేసేలా బండి సంజయ్‌ కసరత్తు చేస్తున్నారు. జంటనగరాల్లో మోదీకి స్వాగతం పలుకుతూ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనున్నారు. అగ్రనేతలు తెలంగాణపై ఫోకస్ పెట్టడంతో స్థానిక బీజేపీ నేతల్లో జోష్ కనిపిస్తోంది.