PM Modi Telangana Tour : తెలంగాణలో ప్రధాని పర్యటన ఖరారు.. ఫిబ్రవరి 13న హైదరాబాద్ కు మోదీ రాక

తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు అయింది. ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ హైదరాబాద్ కు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఐఐటీ హైదరాబాద్ లో నిర్మించిన నూతన భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. వీటితోపాటు తెలంగాణలో మూడు జాతీయ రహదారుల విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

PM Modi Telangana Tour : తెలంగాణలో ప్రధాని పర్యటన ఖరారు.. ఫిబ్రవరి 13న హైదరాబాద్ కు మోదీ రాక

PM Modi

PM Modi Telangana Tour : తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు అయింది. ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ హైదరాబాద్ కు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఐఐటీ హైదరాబాద్ లో నిర్మించిన నూతన భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. వీటితోపాటు తెలంగాణలో మూడు జాతీయ రహదారుల విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోదీ బహిరంగ సభ జరుగనుంది. వాస్తవానికి జనవరి19న ప్రధాని మోదీ హైరాబాద్ కు రావాల్సివుండగా అది కాస్తా వాయిదా పడింది. అయితే ఈ నెల 19న కేవలం సికింద్రాబాద్-విశాఖ మధ్య వందే భారత్ రైలును ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు.

మిగిలిన కార్యక్రమాల షెడ్యూల్ ను వాయిదా వేశారు. దీంతో ఆ రోజు చేపట్టాల్సిన శంకుస్థాపన, ప్రారంభత్సవ కార్యక్రమాలను ఫిబ్రవరి 13న చేపట్టనున్నారు. ఐఐటీ హైదరాబాద్ భవనాన్ని రూ.4 వేల కోట్లతో ఇప్పటికే నిర్మించారు. రూ.2597 కోట్లతో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, హాస్టల్ ను నిర్మించారు. దీనిని ప్రధాని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. రూ.1910 కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్-మహబూబ్ నగర్ రైల్వే లైన్ డబ్లింగ్ కు సంబంధించిన పనులకు శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేయనున్నారు.

PM Modi in Karnataka: డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే ఇదే…: ప్రధాని మోదీ

అదేవిధంగా రూ.699 కోట్లతో చేపట్టనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కాజీపేటలో నిర్వహిస్తున్న రైల్వే ప్రీడియాటిక్ ఓవరాలింగ్ కు సంబంధించి రూ. రూ.521 కోట్లతో చేపట్టనున్న పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అలాగే మహబూబ్ నగర్-సించోలి 161 బీ జాతీయ రహదారులు, నిజాంపేట, నారాయణ్ ఖేడ్, బీదర్ జంక్షన్లను రూ.1500 కోట్లకు సంబంధించిన జాతీయ రహదారులకు కూడా మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

ఒకవైపు రూ.4 వేల కోట్లతో నిర్మాణాలు పూర్తైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. రూ.3 వేల కోట్లకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలకు ప్రధాని హాజరుకానున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. గతంలో అధికారిక పర్యటన కావడంతో కేవలం 15 నుంచి 20 వేల మందితో సభను నిర్వహించాలనుకున్నారు. అయితే దాన్ని ఈసారి భిన్నంగా చేయాలని యోచిస్తున్నారు.

Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ రైలును ప్రారంభించిన మోదీ

ఇప్పటికే 35 వేల 400 ఉన్న బూత్ కమిటీలను బలోపేతం చేసే కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నారు.
ఆ కార్యక్రమాలు ఫిబ్రవరి 10వ తేదీ వరకు పూర్తైతే దాదాపు ఏడు లక్షల మంది బూత్ స్థాయి కార్యకర్తలు, ఫులు టైమర్స్ తో భారీ స్థాయి బూత్ కార్యకర్తల సమ్మేళనానికి ప్రధానిని ఆహ్వానిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గతంలో చెప్పారు. అలాగే పలు సభలను నిర్వహించే ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.