PM Narendra Modi : తెలంగాణలో మెగా టెక్స్‌టైల్ పార్క్ నిర్మిస్తాం-నరేంద్ర మోదీ

తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు రావాలని   ప్రజలు కోరుకుంటున్నారని  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  అన్నారు.

PM Narendra Modi : తెలంగాణలో మెగా టెక్స్‌టైల్ పార్క్ నిర్మిస్తాం-నరేంద్ర మోదీ

Pm Narendra Modi

PM Narendra Modi :  తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు రావాలని   ప్రజలు కోరుకుంటున్నారని  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  అన్నారు.  ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన భారతీయ  జనతాపార్టీ  ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో మోదీ ప్రసంగించారు.  తెలంగాణా బీజేపీని ఆశీర్వదించేందుకు ఎంతో దూరం నుంచి వచ్చిన సోదర, సోదరీమణులకు మాతృమూర్తులకు ప్రతి ఒక్కరికీ నా నమస్కారం అంటూ ప్రధాని మొదట తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

తెలంగాణ మొత్తం ప్రజలందరూ ఈ సభకు వచ్చారనిపిస్తోంది. మీరు నాపట్ల చూపిన ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు. హైదరాబాద్‌కు ప్రతిభకు పట్టం కడుతుంది. బీజేపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని ఆయన అన్నారు.  తెలంగాణలో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను నిర్మిస్తామని మోదీ చెప్పారు. బడుగు బలహీన వర్గాల కోసం బీజేపీ ఎంతో కృషి చేస్తోందని చెప్పిన  మోదీ…. సబ్‌ కా సాథ్‌, సబ్‌కా వికాస్‌ కోసం పనిచేస్తున్నామన్నారు.

కరోనా కష్ట కాలంలో ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించామని… బీజేపీపై తెలంగాణ ప్రజలకు నమ్మకం మరింత పెరిగిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తోందని… గత ఎనిమిదేళ్లలో ప్రతి భారతీయుడికి మంచి చేసే ప్రయత్నం చేశామని మోడీ వివరించారు.

దశాబ్దాల నుంచి వంచనకు గురైన వాళ్ల అభివృద్ధి కోసం పనిచేశాం. 2019 ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు మద్దతు పలికారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా రెపరెపలాడింది. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కరోనా సమయంలో తెలంగాణ ప్రజల కోసం చాలా పనిచేశాం. ఉచిత రేషన్‌, ఉచిత వ్యాక్సిన్‌ అందించాం. తెలంగాణ ప్రజల్లో బీజేపీ నమ్మకం పెరుగుతోందని మోదీ అన్నారు.

హైదరాబాద్‌లో సైన్స్‌ సిటీ ఏర్పాటుకు ఎంతో ప్రయత్నిస్తున్నాం. బయోమెడికల్‌ సైన్సెస్‌ కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. తెలుగులో టెక్నాలజీ, మెడికల్‌ చదువులు ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచించండి. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాం. తెలంగాణ నుంచి భారీగా ధాన్యం కొనుగోలు చేశాం. గత ఆరేళ్లో లక్ష కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసింది. రైతులకు అండగా నిలిచేందుకు మద్దతు ధర పెంచాం. రాష్ట్రంలో జాతీయ రహదారులకు భారీగా నిధులు కేటాయించాం. తెలంగాణలో కొత్త రైల్వే లైన్లను నిర్మించాం.
Also Read : bjp: అందుకే తెలంగాణ‌లో బీజేపీ స‌ర్కారు రావాలి: బండి సంజ‌య్‌