కరోనా లేని రోగికి బిల్లు..30 రోజులకు 32 లక్షలు

  • Published By: bheemraj ,Published On : August 7, 2020 / 04:33 PM IST
కరోనా లేని రోగికి బిల్లు..30 రోజులకు 32 లక్షలు

కరోనా మహమ్మారితో దేశ ప్రజలు అల్లాడుతుంటే ప్రైవేట్ ఆస్పత్రులు మాత్రం సొమ్ము చేసుకుంటున్నాయి. కరోనా పేరుతో అందినకాడికి దండుకుంటున్నాయి. ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నాయి. ఏదైనా అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే కరోనా సోకిందని రోగిని భయభ్రాంతులకు గురి చేసి వైద్యం కోసమంటూ వేల నుంచి లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. కరోనా పేరుతో ఇష్టానుసారంగా బిల్లులు వేసి దోచుకుంటున్నారు.



కరోనా రోగులకు ప్రైవేట్ ఆస్పత్రులు భారీగా బిల్లులు వేస్తుండటంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే తరహాలో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఓ రోగికి 30 రోజులకు రూ.32 లక్షల బిల్లు వేయగా, అదది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయంపై సంబంధిత ఆస్పత్రి వర్గాలు వివరణ ఇచ్చాయి.



‘నెల రోజులుగా బాధిత వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. న్యూమోనియాతోపాటు సెప్టిక్ షాక్ కు గురయ్యారు. కరోనా సోకకపోయినా ఊపరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్లేట్ లెట్ల సంఖ్య గణనీయంగా పడిపోవడంతోపాటు రెండు మూత్ర పిండాలు పని చేయడం లేదు. డయాలసిస్ చేస్తూ వెంటిలేటర్ పై చికిత్స అందించాం. రోగి పరిస్థితిని ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు తెలిపాం’ అని వివరించారు.