Covid Patient : ఇన్స్యూరెన్స్‌ డబ్బుల కోసం.. కోవిడ్ పేషెంట్ ను స్టోర్ రూమ్ లో నిర్బంధించిన ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం

హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం బయటపడింది. కొవిడ్‌ ఉందని అడ్మిట్‌ అయితే.. అవసరం లేని టెస్టులన్నీ చేసి 4 లక్షల రూపాయల బిల్లు వేసి ఆ రోగి చేతిలో పెట్టింది. ఆ మొత్తాన్ని చెల్లించకపోతే బయటకు పంపించేది లేదంటూ ఆస్పత్రి సిబ్బంది స్టోర్‌ రూమ్‌లో నిర్బంధించారు.

Covid Patient : ఇన్స్యూరెన్స్‌ డబ్బుల కోసం.. కోవిడ్ పేషెంట్ ను స్టోర్ రూమ్ లో నిర్బంధించిన ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం

Covid Patient

Private hospital locked covid patient : హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం బయటపడింది. అల్వాల్‌కు చెందిన ఓ వ్యక్తికి కరోనా వచ్చింది. ట్రీట్‌మెంట్ చేయించుకోవడానికి ఈనెల ఒకటిన హైదరాబాద్‌ బేంగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ ఉండడంతో చికిత్స ఖర్చు మొత్తం క్లెయిం చేసుకుంటామని ఆస్పత్రి యాజమాన్యం చెప్పింది. మంచి ట్రీట్‌మెంట్‌ ఇస్తామని చెప్పింది.

కొవిడ్‌ ఉందని అడ్మిట్‌ అయితే.. అవసరం లేని టెస్టులన్నీ చేసి 4 లక్షల రూపాయల బిల్లు వేసి ఆ రోగి చేతిలో పెట్టింది. ఆ మొత్తాన్ని చెల్లించకపోతే బయటకు పంపించేది లేదంటూ ఆస్పత్రి సిబ్బంది స్టోర్‌ రూమ్‌లో నిర్బంధించారు. అల్వాల్‌కు రామారావు అనే పెద్దాయనను స్టోర్‌రూంలో వేసేశారు విన్‌ హాస్పిటల్‌ సిబ్బంది. గడచిన 20 రోజుల నుంచి ఆయన ఆ రూమ్‌లోనే ఉన్నారు. రూమ్‌లో ఉంటూ ఆయన తీసిన వీడియో సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రికి ఫిర్యాదు చేశానంటున్నారాయన. తొలుత ఇన్స్యూరెన్స్‌ డబ్బులు క్లెయిమ్‌ చేసుకుంటామని ఆస్పత్రిలో జాయిన్‌ చేసుకున్నారని, ఇప్పుడు ఇన్స్యూరెన్స్‌ రావడం లేదంటూ 4 లక్షల రూపాయలకు బిల్లులు చేతిలో పెట్టారంటున్నారు రామారావు. టెస్టు రిపోర్టులు లేకపోవడంతో ఇన్స్యూరెన్స్‌ను సంబంధిత సంస్థ నిలిపేసిందని, దీంతో ఆ డబ్బులు మొత్తం చెల్లించాలంటూ ఆస్పత్రి యాజమాన్యం ఓ రూమ్‌లో బంధించిందని రామారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.