తెలంగాణలో తీవ్ర విషాదం, ఆర్థిక ఇబ్బందులతో స్కూల్ టీచర్ ఆత్మహత్య

నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ హిల్ కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆర్ధిక ఇబ్బందులతో ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య చేసుకున్నాడు.

తెలంగాణలో తీవ్ర విషాదం, ఆర్థిక ఇబ్బందులతో స్కూల్ టీచర్ ఆత్మహత్య

Private School Teacher Suicide

Private School Teacher Suicide : నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ హిల్ కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆర్ధిక ఇబ్బందులతో ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా కారణంగా ఏడాది నుండి జీతాలు రాకపోవడంతో అతడి కుటుంబం ఆర్ధికంగా చితికిపోయింది. దీంతో ఆర్థిక విషయాల్లో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భార్య ఇల్లు వదిలి వెళ్లిపోయింది. మనస్తాపానికి గురైన చెందిన టీచర్ మంగళవారం(ఏప్రిల్ 6,2021) ఆత్మహత్య చేసుకున్నాడు.

మృతుడిని రవిగా గుర్తించారు. సాగర్ లోని ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పని చేస్తున్నాడు. ఇటీవలే ఒక్క నెల రోజుల పాటు స్కూల్స్ తిరిగి తెరిచారు. అయితే కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి విద్యా సంస్థలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

కరోనా మహమ్మారి అందరి జీవితాలను అతలాకుతలం చేసింది. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. రోజు గడవటం కష్టంగా మారింది. ఓ పూట తిండి కూడా దొరక్క చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ లో పని చేసే టీచర్ల పరిస్థితి దయనీయంగా ఉంది. ఏడాదిగా స్కూల్స్ లేకపోవడంతో జీతాలు లేక ఆర్థికంగా చితికిపోయారు. కరోనా కారణంగా ఏడాదిగా విద్యాసంస్థలు మూతపడటంతో టీచర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. వారి కుటుంబాలు దీన స్థితిలో ఉన్నాయి. ప్రభుత్వం విద్యాసంస్థలు మూసివేయడంతో వారి ఉపాధి పోయిందని. కనీసం ఇంటి అద్దె కట్టే పరిస్థితీ లేదు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని టీచర్లు వేడుకుంటున్నారు.