KTR: గౌతమ్ అదానీపై ప్రొ.కె.నాగేశ్వర్ ట్వీట్.. స్పందించిన కేటీఆర్.. మోదీపై సెటైరికల్ రిప్లై

గౌతమ్ అదానీ సంపద పెరిగిపోవడంపై ప్రొ.కె.నాగేశ్వర్ వేసిన ట్వీట్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ రిప్లై ఇచ్చారు. దేశ ప్రజల అకౌంట్లలో డిపాజిట్ చేస్తానన్న డబ్బంతా.. మోదీ ఒక్క అకౌంట్లోనే వేశారేమో అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

KTR: గౌతమ్ అదానీపై ప్రొ.కె.నాగేశ్వర్ ట్వీట్.. స్పందించిన కేటీఆర్.. మోదీపై సెటైరికల్ రిప్లై

K.T.Rama Rao slam bjp

KTR: ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీ గురించి ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ వేసిన ట్వీట్‌కు, తెలంగాణ మంత్రి కేటీఆర్ రిప్లై ఇచ్చారు. మోదీపై వ్యంగ్యంగా విమర్శలు సంధించారు. తాజాగా ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

Jersey: ఇండియా-పాక్ మ్యాచ్.. పాకిస్తాన్ జెర్సీ ధరించిన భారతీయుడు… ప్రాంక్ కోసమట!

‘బ్లూమ్‌బర్గ్’ అనే అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో టెస్లా సీఈవో ఎలన్ మస్క్ మొదటి స్థానంలో, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ రెండో స్థానంలో నిలిచారు. వారి తర్వాతి స్థానంలో అదానీ ఉన్నారు. అయితే, ఈ అంశంపై ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఒక ట్వీట్ చేశారు. ‘‘గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆయన సంపద 10.9 లక్షల కోట్లు. గత ఫిబ్రవరిలో ఆయన సంపద రూ.6.6 లక్షల కోట్లు మాత్రమే. దేశం అభివృద్ధి చెందట్లేదని ఎవరన్నారు’’ అని ప్రొఫెసర్ నాగేశ్వర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.

India: దేశంలో మరింత పెరగనున్న ఎండలు.. తాజా సర్వేలో వెల్లడి

ఆరు నెలల కాలంలోనే గౌతమ్ అదానీ సంపద దాదాపు నాలుగు లక్షల కోట్లు పెరిగిందని నాగేశ్వర్ పరోక్షంగా ప్రస్తావించారు. దీనిపై కేటీఆర్ స్పందించారు. ‘‘ప్రతి పేదవాడి అకౌంట్లో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తానని మోదీ ప్రామిస్ చేశారు. అయితే, ఆ డబ్బంతా ఒక్క అకౌంట్లోనే డిపాజిట్ అయ్యుండొచ్చు’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ విషయంలో మోదీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని, గౌతమ్ అదానీ సంపద మాత్రం పెరిగిందని కేటీఆర్ పరోక్షంగా విమర్శించారు.