KTR: క్లిష్ట పరిస్థితుల్లోనూ పురోగతి.. తెలంగాణ పౌరుని ఆదాయం పెరిగింది -కేటీఆర్

హైదరాబాద్‌ను ప్రీమియర్ ఇన్వెస్ట్‌‌మెంట్ డెస్టినేషన్‌గా మారుస్తామని తెలంగాణ ఐటీశాఖా మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. హైదరాబాద్‌లోనే కాకుండా వరంగల్, కరీంనగర్‌లో కూడా ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయని, రామగుండం, సిద్ధిపేట, నల్గొండల్లో త్వరలోనే ఐటీ టవర్స్ నిర్మాణం చేట్టనున్నట్లు ప్రకటించారు మంత్రి కేటీఆర్.

KTR: క్లిష్ట పరిస్థితుల్లోనూ పురోగతి.. తెలంగాణ పౌరుని ఆదాయం పెరిగింది -కేటీఆర్

Ktr

Telangana citizen: హైదరాబాద్‌ను ప్రీమియర్ ఇన్వెస్ట్‌‌మెంట్ డెస్టినేషన్‌గా మారుస్తామని తెలంగాణ ఐటీశాఖా మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. హైదరాబాద్‌లోనే కాకుండా వరంగల్, కరీంనగర్‌లో కూడా ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయని, రామగుండం, సిద్ధిపేట, నల్గొండల్లో త్వరలోనే ఐటీ టవర్స్ నిర్మాణం చేట్టనున్నట్లు ప్రకటించారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ ఫార్మా సిటీ భూసేకరణ దాదాపు పూర్తి అయ్యిందని, కేసీఆర్ చేతుల మీదుగా త్వరలో ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.

తెలంగాణ ఐటీ సాధించిన పురోగతిని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాం. కానీ కరోనా వల్ల పరిమితంగా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పారదర్శకత కోసం ఐటీ వార్షిక నివేదికలను విడుదల చేస్తూ ఉన్నట్లు చెప్పారు. కేసీఆర్ దార్శనికతతో అన్ని రంగాల్లో దూసుకుపోతున్నామని, దేశ పౌరుని సగటు
తలసరి వార్షిక ఆదాయం 1,27,768 ఉంటే, తెలంగాణ రాష్ట్ర పౌరుని తలసరి ఆదాయం 2,27,145 ఉందని అన్నారు కేటీఆర్.

20-21లో తెలంగాణ ఐటీ రంగం ఎగుమతులు 1 లక్ష 45 వేల కోట్లు అని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పుడు ఐటి ఎగుమతుల విలువ 57 వేల కోట్లు మాత్రమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయినప్పడు ఐటీలో ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య 3 లక్షల 23 వేల మంది అని, నేడు 6,28,615 కు పెరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 80 శాతం పెట్టుబడిదారులు మళ్ళీ ఇక్కడే పెట్టుబడులు పెడుతున్నారని వెల్లడించారు.

తెలంగాణలో అమెజాన్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేసిందని, టీఎస్ఐసీసీ 10 ఇండస్ట్రియల్ పార్క్‌లు కొత్తగా ఏర్పాటు చేసిందని చెప్పారు. గతేడాది ఎన్నో పెద్ద కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయని, T హబ్, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్, V హబ్‌లు మంచి ఫలితాలు అందిస్తున్నాయని, కొత్త టెక్నాలజీకి పాలసీ విషయంలో తెలంగాణ ముందుందని అన్నారు. ఎస్ఎమ్ఈ‌లు కరోనా వల్ల దెబ్బతిన్నాయని, ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదుకోవాలని కోరారు.