Telangana : కరోనా కాలంలో ఆర్థిక కష్టాలు, ఆస్తి పన్ను పెంపు ?

కరోనా కాలంలో ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు తెలంగాణ సర్కార్‌ శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే నిరుపయోగంగా ఉన్న సర్కారీ భూముల అమ్మకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సంక్షేమ పథకాలకు భారీగా ఖర్చవుతోంది. కానీ కరోనాతో ఆదాయానికి భారీగా గండిపడింది. దీంతో.. తక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని భూముల అమ్మకానికి పెట్టింది.

Telangana : కరోనా కాలంలో ఆర్థిక కష్టాలు, ఆస్తి పన్ను పెంపు ?

Tg

Property Tax : కరోనా కాలంలో ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు తెలంగాణ సర్కార్‌ శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే నిరుపయోగంగా ఉన్న సర్కారీ భూముల అమ్మకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సంక్షేమ పథకాలకు భారీగా ఖర్చవుతోంది. కానీ కరోనాతో ఆదాయానికి భారీగా గండిపడింది. దీంతో.. తక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని భూముల అమ్మకానికి పెట్టింది. అయితే…దీంతో.. రూ. 16 వందల కోట్ల ఆదాయం మాత్రమే సమకూరుతుందన్న అంచనాలున్నాయి. భూ విక్రయాలతో వచ్చే ఆదాయంతో ఒక నెల అవసరాలు తీరతాయి. కానీ స్థిరమైన ఖజానా కోసం ప్రజలపై భారం మోపేందుకే సర్కార్‌ సిద్ధపడింది. ఇందులో భాగంగా తొలుత.. వ్యవసాయేతర భూముల విలువను కనీసం 30 శాతం, వ్యవసాయ భూముల విలువను కనీసం 20 శాతం పెంచాలని నిర్ణయించింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో భూములకు డిమాండ్‌ పెరిగింది. భూ క్రయ విక్రయాలు భారీ సంఖ్యలో కొనసాగుతున్నాయి. మార్కెట్‌ విలువ పెంచితే రిజిస్ట్రేషన్‌ స్టాంప్‌ డ్యూటీ రూంలో సమకూరే ఆదాయం మరింతగా పెరగనుంది. ఈ ఏడాది రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా కనీసం రూ. 15 వేల కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తున్న సర్కార్‌ ఆ మేరకు చర్యలు తీసుకుంటోంది. అటు ఆస్తి పన్నును సైతం పెంచాలని భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇంతవరకు ఆస్తి పన్నును పెంచలేదు. పరోక్షంగా ఇతర పద్ధతుల్లో పన్నులను పెంచింది. దీంతో ఆస్తి పన్నును సవరించాలకుంటోంది. ఏపీలో జగన్‌ సర్కార్‌ ఆస్తి పన్ను పెంచడంతో తెలంగాణ సర్కార్‌ కూడా అదే తరహాలో పెంపు ప్రతిపాదనలు చేస్తోంది.

తెలంగాణలో ఆస్తుల విలువ భారీగా పెరిగింది. అద్దెలూ పెరిగాయి. కానీ ఆ స్థాయిలో ఆస్తి పన్ను రాబడి లేదు. గతంలో LRS, BRS స్కీమ్‌ను తీసుకొచ్చింది ప్రభుత్వం. కానీ కోర్టు వివాదాలు, ఆశించిన మేర వర్కవుట్‌ కాకపోవడంతో.. ప్రాపర్టీ ట్యాక్స్‌లను పెంచడం ద్వారా ఆదాయ పెంచుకోవాలని సర్కార్‌ భావిస్తోంది. ఏపీలో నివాస గృహాల ఆస్తి విలువపై 0.15 శాతం, వాణిజ్య సంస్థలు, నివాసేతర భవనాలపై 0.3 శాతం, ఖాళీ స్థలాలపై 0.5 శాతం పన్ను వేసారు. ఇంచుమించు తెలంగాణలోనూ ఇదే రీతిలో పన్నులను పెంచే అవకాశాలను సర్కార్ పరిశీలిస్తోంది.