Hostel‌ closed : హాస్టల్‌ మూసివేతను వ్యతిరేకిస్తూ రోడ్డెక్కిన స్టూడెంట్స్‌

సికింద్రాబాద్ ప్యారడైజ్‌ వద్ద పీజీ కాలేజ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ హాస్టల్‌ను మూసివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Hostel‌ closed : హాస్టల్‌ మూసివేతను వ్యతిరేకిస్తూ రోడ్డెక్కిన స్టూడెంట్స్‌

Protest Of Pg College Students At Secunderabad Paradise

protest of PG College students : సికింద్రాబాద్ ప్యారడైజ్‌ వద్ద పీజీ కాలేజ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ హాస్టల్‌ను మూసివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్‌లో ఉండేందుకు అనుమతివ్వాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ మెయిన్ రోడ్డుపై ఆందోళన చేపట్టారు.

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు స్కూళ్లలో కరోనా వ్యాప్తిపై మంగళవారం (మార్చి 23, 2021) మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని స్కూల్స్, కాలేజీలు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. తాత్కాలికంగా స్కూళ్లు మూసివేస్తున్నట్లు వెల్లడించారు. మెడికల్ కాలేజీలు మినహా అన్ని విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి నిరోధించడానికి విద్యా సంస్థలను మూసివేస్తున్నామని చెప్పారు.

మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ వాయిదాపడ్డాయి. కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. ఎగ్జామ్స్‌కు సంబంధించి అన్ని వర్సిటీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత పరీక్షల తేదీలను ప్రకటిస్తామని అన్నారు.