Bharati Hollikeri : మంచిర్యాల జిల్లా కలెక్టర్‌‌కు నిరసన సెగ

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు నిరసన సెగ తగిలింది. జిల్లాలోని చెన్నూరు మండలం సుధారసాల గ్రామంలో పర్యటనకు వెళ్లిన మంచిర్యాల కలెక్టర్ భారతి హోలికేరిని గెరావ్ చేశారు గ్రామస్తులు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అన్నారం బ్యారేజ్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. అయితే బ్యారేజ్ బ్యాక్ వాటర్ లో గ్రామానికి చెందిన 800 ఎకరాల పంటపొలాలు నీట మునిగాయి

Bharati Hollikeri : మంచిర్యాల జిల్లా కలెక్టర్‌‌కు నిరసన సెగ

Bharati Hollikeri

Bharati Hollikeri : మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు నిరసన సెగ తగిలింది. జిల్లాలోని చెన్నూరు మండలం సుధారసాల గ్రామంలో పర్యటనకు వెళ్లిన మంచిర్యాల కలెక్టర్ భారతి హోలికేరిని గెరావ్ చేశారు గ్రామస్తులు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అన్నారం బ్యారేజ్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. అయితే బ్యారేజ్ బ్యాక్ వాటర్ లో గ్రామానికి చెందిన 800 ఎకరాల పంటపొలాలు నీట మునిగాయి.

పొలాలను పరిశీలించేందుకు గ్రామానికి వచ్చారు కలెక్టర్.. ఇదే సమయంలో ఆమెను గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రతి ఏడు వర్షాకాలంలో తమకు పంటనష్టం జరుగుతుందని, అన్నారం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వలన తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని రైతులు కలెక్టర్ ముందు వాపోయారు. వచ్చి చూసివెళ్లడం తప్ప అధికారులు నష్టపరిహారం ఇప్పించడం లేదని మండిపడ్డారు. ఇదే సమయంలో తాను పంటపొలాలు పరిశీలించి నష్టపరిహారం ఇప్పించేందుకే వచ్చానని తెలిపారు కలెక్టర్. అయినా కలెక్టర్ మాట వినకపోవడంతో ఆమె వెనుదిరిగి వెళ్లారు.

కాగా గత కొద్దీ రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంచిర్యాల జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జలాశయాలు చెరువులు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్నారు. దీంతో ప్రాజెక్టులకు సమీపంలో ఉన్న పంటపొలాలు నీటమునిగాయి. మరోవైపు పలు గ్రామాలను వరద నీరు ముంచెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి.