Punjab CM Bhagwant Mann Meet CM KCR : నేడు తెలంగాణకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. సీఎం కేసీఆర్ తో సమావేశం

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నేడు తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

Punjab CM Bhagwant Mann Meet CM KCR : నేడు తెలంగాణకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. సీఎం కేసీఆర్ తో సమావేశం

Punjab CM Bhagwant Mann Meet CM KCR  : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నేడు తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అనంతరం పలువురు పారిశ్రామికవేత్తలతో భగవంత్ మాన్ భేటీ కానున్నారు.

ఫిబ్రవరి నెలలో పంజాబ్ లోని మోహాలిలో జరుగనున్న ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ కు వారిని ఆహ్వానించనున్నారు. ఈ నెల 24వ తేదీన పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ కుల్తార్ సింగ్ సంధ్వాన్  కూడా తెలంగాణకు రానున్నారు.

Bhagwant Mann : తగ్గేదేలే…అంటున్న పంజాబ్ కొత్త సీఎం భగవంత్ మాన్‌

ఆయనతోపాటు డిప్యూటీ స్పీకర్ జైకిషన్ సింగ్ రౌరీ, రాజ్యసభ సభ్యులు విక్రమ్ జీత్ సింగ్ సాహ్ని, ఎమ్మెల్యే కుల్వంత్ సింగ్ పండోరితోపాటు మరో ఇద్దరు నేతలు కూడా హైదరాబాద్ కు రానున్నారు.