సూట్‌కేసుపై చిన్నారిని మోసుకెళ్తున్న వలస కార్మికురాలు.. పరిస్థితిపై NHRC విచారణ

  • Published By: Subhan ,Published On : May 16, 2020 / 03:34 AM IST
సూట్‌కేసుపై చిన్నారిని మోసుకెళ్తున్న వలస కార్మికురాలు.. పరిస్థితిపై NHRC విచారణ

పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు పంపింది. వలస కార్మికుల్లో ఓ మహిళ చిన్నారిని సూట్ కేసుపై పడుకోబెట్టి లాక్కెళ్లుకుతున్న ఫొటో పై విచారణ జరిపింది. కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ఆగ్రా హైవేపై కాలిబాటన వెళ్తున్న వలస కార్మికుల పరిస్థితి ఇది. 

హక్కుల ప్యానెల్ శుక్రవారం ప్రస్తుత పరిస్థితిపై స్టేట్‌మెంట్ విడుదల చేసింది. లాక్‌డౌన్ సమయంలో తలెత్తిన సమస్య ఏదైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నాయి. ‘ఆ చిన్నారి కష్టం, ఆ కుటుంబం పడుతున్న బాధ అందరికీ కనిపిస్తుంది కాని స్థానిక ప్రభుత్వానికి మాత్రం కాదు’ అని  National Human Rights Commission of India (NHRC) చెప్పుకొచ్చింది. 

స్థానిక ప్రభుత్వాలు వెంటనే ఆ కుటుంబానికి సాయం చేయాలి. ఈ ఘటన మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఎన్‌హెచ్ఆర్సీ పేర్కొంది. ‘దీనిపై పంజాబ్, ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీలు, ఆగ్రా జిల్లా మెజిస్ట్రేట్ ను  4వారాల్లో రిపోర్టు అందజేయాలని ఆదేశించాం. ఈ పరిస్థితికి కారణమైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆ కుటుంబానికి సహకారంతో పాటు కొంత సాయం కూడా అందించాలి’ అని కమిషన్ తెలిపింది. 

లాక్‌డౌన్  సమయంలో చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు కమిషన్ దృష్టికి వచ్చింది. కేంద్రం, రాష్ట్రం పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తూనే ఉంది. వలస కార్మికులు సుదీర్ఘ ప్రయాణాల్లో ఇంకా అవే తంటాలు పడుతున్నారని మీడియా చెప్తూనే ఉంది. 

కొద్ది రోజుల క్రితం మహిళా వలస కూలీ రోడ్డుపైనే డెలివరీ పూర్తి చేసుకుని 2గంటల గ్యాప్ తో మళ్లీ ప్రయాణం మొదలుపెట్టింది. మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు చేసిన ప్రయాణంలో దాదాపు 300కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. ఇటువంటి ఘటనలు స్థానిక ప్రభుత్వాల అజాగ్రత్త, ప్రజలకు పాలన అందించకపోవడం వల్లనే జరుగుతుంది. క్షేత్రస్థాయిలో జరిగే విషయాలను గమనించాలి’ అని కమిషన్ తెలిపింది. 

Read Here>> వలసదారులకు సామూహిక కరోనా పరీక్షలు, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు