Grain Purchase : తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు

కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డినా.. ఈ నెల 3 నాటికి 65 లక్షల 20 వేల టన్నుల ధాన్యం సేకరించిందన్నారు. మిగిలిన మొత్తాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పారు.

Grain Purchase : తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు

Grain

Purchase of grain in Telangana : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వానాకాలంలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిందని మంత్రి గంగుల కమలాకర్‌ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డినా.. ఈ నెల 3 నాటికి 65 లక్షల 20 వేల టన్నుల ధాన్యం సేకరించిందన్నారు. మిగిలిన మొత్తాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పారు. తెలంగాణ నుంచి ఖరీఫ్ సీజన్ లో ధాన్యం సేకరణను కేంద్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే.

ఖరీఫ్ సీజన్ లో తెలంగాణ నుంచి మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించనున్నట్లు వెల్లడించింది. పెంచిన బియ్యం కోటాతో కలిపి ఖరీఫ్ సీజన్ లో 46 లక్షల మెట్రిక్ టన్నల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయనుంది. ఈ మేరకు మంగళవారం (డిసెంబర్ 28,2021) కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. ఖరీఫ్ సీజన్ లో 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకుంటామని తెలిపింది.

Special Buses : సంక్రాంతికి ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబడుతూ ఇప్పటికే టీఆర్ఎస్ ధర్నాలు నిర్వహించింది. అస్పష్ట విధానం అనుసరిస్తున్న కేంద్రంపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కూడా టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర నిరసన, ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంపై తెలంగాణ మంత్రుల బృందం కేంద్రంతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే.

అలాగే ధాన్యం కొనుగోలు విషయంలో విపక్షాలు సైతం కేంద్రంపై విమర్శలు చేశారు. రాష్ట్రం నుంచి ఖరీఫ్ లో కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కొనుగోలును కేంద్రం పెంచింది. ఖరీఫ్ సీజన్ లో తెలంగాణ నుంచి మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించనున్నట్లు వెల్లడించింది.