ప్లీజ్.. కేటీఆర్ ను కలిసే అవకాశమివ్వండి : బ్యాలెట్ బాక్సులో ఓట్లతో పాటు లెటర్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ జరుగుతోంది. శనివారం(జనవరి 25,2020) ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమైంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఓట్ల

  • Published By: veegamteam ,Published On : January 25, 2020 / 03:51 AM IST
ప్లీజ్.. కేటీఆర్ ను కలిసే అవకాశమివ్వండి : బ్యాలెట్ బాక్సులో ఓట్లతో పాటు లెటర్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ జరుగుతోంది. శనివారం(జనవరి 25,2020) ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమైంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఓట్ల

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ జరుగుతోంది. శనివారం(జనవరి 25,2020) ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమైంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కౌంటింగ్ కోసం అధికారులు 2వేల 619 టేబుళ్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. 

1

మంథనిలో బ్యాలెట్ బాక్సులో ఓట్లను లెక్కిస్తున్న అధికారులకు ఓ లేఖ దొరికింది. ఓట్లతో పాటు బాక్సులో లేఖ ఉండటంతో అధికారులు అవాక్కయ్యారు. ఆ లేఖను ఓపెన్ చేసి చదివారు. అది ఓ దివ్యాంగుడు మంత్రి కేటీఆర్ కు రాసిన లేఖ. మంత్రి కేటీఆర్ ను కలవాలని ఉందని దివ్యాంగుడు ఆ లేఖలో రాశాడు. వెన్నెముక గాయాలతో దివ్యాంగుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని లేఖలో వాపోయాడు. కేటీఆర్ ను కలిసేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని లేఖలో కోరాడు. మరి దీనిపై మంత్రి కేటీఆర్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ జోరు మీదుంది. టీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. పలు మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. మున్సిపాలిటీ ఫలితాల్లో టీఆర్ఎస్ బోణీ కొట్టింది. పరకాల, చెన్నూరు మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చెన్నూరులో మొత్తం 18 వార్డులను దక్కించుకుంది. పరకాలలో మొత్తం 22 వార్డులు కైవసం చేసుకుంది. 

శనివారం(జనవరి 25,2020) ఉదయం 8 గంటలకు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 134 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ప్రతి వార్డుకు రెండు టేబుల్స్ ను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నంలోపు ఫలితాలు వెలువడనున్నాయి. మొద‌ట పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారు. తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని బ్యాలెట్ పత్రాలను పార్టీల వారిగా విభ‌జించి బండిల్‌గా కట్టి.. లెక్కిస్తున్నారు. 120 మున్సిపాలిటీలు.. 9 కార్పొరేషన్లలో 12వేల 926 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.