Rahul Gandhi Key Meeting : తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్.. రేపు రాహుల్ గాంధీ కీలక సమావేశం

కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తోంది.(Rahul Gandhi Key Meeting)

Rahul Gandhi Key Meeting : తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్.. రేపు రాహుల్ గాంధీ కీలక సమావేశం

Rahul Gandhi Key Meeting

Rahul Gandhi Key Meeting : కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేలా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు.

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నాయకులు రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ లో అన్ని గ్రూపులను రాహుల్ తో సమావేశానికి అధిష్టానం పిలిచింది. పార్టీ బలోపేతం, ప్రజా ఉద్యమాలపై పార్టీ శ్రేణులకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ లోని గ్రూపు రాజకీయాలపై ప్రధానంగా చర్చించనున్నారు. రేవంత్ రెడ్డిని తీవ్రంగా విభేదిస్తున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీనియర్ నేత వి.హనుమంతరావులకు ఆహ్వానం అందింది. ఈ సమావేశంలోనే రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ షెడ్యూల్ ను ఖరారు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.(Rahul Gandhi Key Meeting)

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో చావు దెబ్బతిన్న కాంగ్రెస్.. భవిష్యత్తులో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై ఇప్పటి నుండే దృష్టిసారిస్తోంది. అందులో భాగంగా తెలంగాణపై ఫోకస్ పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా పట్టు సాధించాలని ప్రయత్నంలో రాహుల్ గాంధీ ఉన్నారు.

TPCC : భట్టితో పాటు 10 మంది సీనియర్లకు అధిష్టానం పిలుపు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించటానికి, భవిష్యత్తు ఎన్నికల్లో కాంగ్రెస్ కు పునర్ వైభవాన్ని తీసుకురావడానికి నిర్ణయించిన రాహుల్ గాంధీ ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంపై దృష్టి సారించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకుంటుందని రాహుల్ భావించారు. ఈ క్రమంలో ఇప్పటికే ఓ మారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశమైన రాహుల్ గాంధీ.. ఈ నెల 4న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలతో మరోమారు సమావేశం నిర్వహించనున్నారు.

ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పోరాటాలు చేయాల్సిన పరిస్థితులపై కూడా రాహుల్ గాంధీతో భేటీలో చర్చించనున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పై కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన ఉద్యమాలకు కూడా కార్యాచరణ రూపొందించనున్నారని సమాచారం.

కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను ఢిల్లీలోని ఆ పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదనే వాదన వినిపించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో చర్చించేందుకు ఆ పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది. ఈ భేటీలో పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలకు సంబంధించిన అంశాలపైనా ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు తీవ్రమవుతూ వచ్చాయి. నేతల పరస్పర ఆరోపణలు, ఒకరిపై ఒకరు హైకమాండ్‌కు ఫిర్యాదులు చేసుకుంటూ వచ్చారు. అయితే నేతల మధ్య నెలకొన్న ఈ విభేదాలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దగా చొరవ తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. దీనికితోడు జాతీయస్థాయిలోనే కాంగ్రెస్ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ను పట్టించుకునే వారే కరువయ్యారు. ఇక్కడ పార్టీ నేతలకు, శ్రేణులకు దిశానిర్దేశం చేసే నాయకులు లేకుండాపోయారు.

ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అపాయింట్‌మెంట్ ఇచ్చి చర్చించేందుకు రావాలని కోరడంతో.. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొత్త ఆశలు చిగురించాయి.