Bharat Jodo Yatra: తెలంగాణలో రాహుల్ భారత్‌ జోడో యాత్ర పునః ప్రారంభం.. పాల్గొన్న రేవంత్ రెడ్డి, ఉత్తమ్

కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ నిర్వహిస్తున్న భారత్‌ జోడో యాత్ర ఇవాళ తెలంగాణలో పునఃప్రారంభమైంది. ఈ యాత్రకు మూడు రోజుల పాటు విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం మక్తల్ సమీపంలోని సబ్ స్టేషన్ నుంచి ఈ యాత్ర మళ్ళీ ప్రారంభమైంది. ఇందులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తదితర నేతలు పాల్గొన్నారు. ఇవాళ మధ్యాహ్నం జక్లేర్ వద్ద భోజన విరామం తీసుకుంటారు.

Bharat Jodo Yatra: తెలంగాణలో రాహుల్ భారత్‌ జోడో యాత్ర పునః ప్రారంభం.. పాల్గొన్న రేవంత్ రెడ్డి, ఉత్తమ్

Rahul Gandhi skips gujarat and himachal assembly elections

Bharat Jodo Yatra: కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ నిర్వహిస్తున్న భారత్‌ జోడో యాత్ర ఇవాళ తెలంగాణలో పునఃప్రారంభమైంది. ఈ యాత్రకు మూడు రోజుల పాటు విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం మక్తల్ సమీపంలోని సబ్ స్టేషన్ నుంచి ఈ యాత్ర మళ్ళీ ప్రారంభమైంది. ఇందులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తదితర నేతలు పాల్గొన్నారు.

ఇవాళ మధ్యాహ్నం జక్లేర్ వద్ద భోజన విరామం తీసుకుంటారు. అనంతరం మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. గుడిగండ్ల వరకు పాదయాత్ర ఉంటుంది. ఇవాళ రాత్రి ఎలిగండ్లలో రాహుల్ గాంధీ బస చేస్తారు. జోడో యాత్ర ఇవాళ దాదాపు 28 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది.

ఈ నెల 23న కర్ణాటకలోని రాయచూర్‌ నుంచి తెలంగాణలోని మక్తల్‌ నియోజకవర్గంలోకి ఆ యాత్ర ప్రవేశించింది. గుడెబల్లూరు వద్ద పాదయాత్రకు రాహుల్ విరామం ఇచ్చారు. దీపావళి, కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం వంటి కార్యక్రమాల నేపథ్యంలో ఆ యాత్రకు మూడు రోజుల పాటు బ్రేక్ పడింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..