Railway Board: గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు రైల్వేబోర్డు పచ్చ జెండా

ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో కొత్త రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, వై-ఫైలు, రూ.30వేల కోట్ల విలువైన డబ్లింగ్, ట్రిప్లింగ్ లైన్లు, వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను తెలుగు రాష్ట్రాలకు అందించింది కేంద్ర ప్రభుత్వం.

Railway Board: గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు రైల్వేబోర్డు పచ్చ జెండా

Railway Board

Railway Board – Telugu states: తెలుగు రాష్ట్రాల్లో (Andhra Pradesh – Telangana) రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు రైల్వేబోర్డు అంగీకారం తెలిపింది. ఆరు నెలల్లో సర్వే పూర్తిచేయాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. విశాఖపట్నం-విజయవాడ-శంషాబాద్, విశాఖపట్నం-విజయవాడ-కర్నూలు మార్గంలో సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వే చేపట్టనుంది రైల్వే బోర్డు.

రెండు రైల్వే లైన్లు కలిసి 942 కిలోమీటర్ల మార్గంలో (గరిష్ఠంగా 220 kmph వేగంతో ప్రయాణించేలా) రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన సర్వే నిర్వహించనుంది. రెండు రాష్ట్రాల మధ్య రైల్వే అనుసంధానం మరింత బలోపేతం కానుంది. దక్షిణ మధ్య రైల్వేకు రైల్వే బోర్డు లేఖ పంపింది.

సూపర్ ఫాస్ట్ రైల్వే ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన టెక్నికల్ ఫీజిబిలిటీని సర్వే ద్వారా నిర్ణయించనుంది రైల్వే బోర్డు. సర్వే పూర్తి తర్వాత ఫీజిబిలిటీ ఆధారంగా ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయి. సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు సంబంధించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పలుమార్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసి, విజ్ఞాపనలు అందజేశారు.

ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో కొత్త రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, వై-ఫైలు, రూ.30వేల కోట్ల విలువైన డబ్లింగ్, ట్రిప్లింగ్ లైన్లు, వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను తెలుగు రాష్ట్రాలకు అందించింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణలో వ్యాగన్ తయారీ, ఓవర్‌హాలింగ్ కేంద్రాన్ని, ఎంఎంటీఎస్ (రెండోదశ), సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ, చర్లపల్లి టర్మినల్ వంటి ప్రాజెక్టులను కేంద్ర సర్కారు చేపట్టింది.

Telangana : తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం విశేషాలు