Rain Alert : ఎండలతో మండిపోతున్న రాష్ట్రానికి చల్లని కబురు..మూడు రోజులు వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు విలవిలలాడుతున్నారు. రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారింది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మూడు రోజులు తెలంగాణలో

Rain Alert : ఎండలతో మండిపోతున్న రాష్ట్రానికి చల్లని కబురు..మూడు రోజులు వర్షాలు

Telangana Rain Alert

Telangana Rain Alert : తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు విలవిలలాడుతున్నారు. రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారింది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మూడు రోజులు తెలంగాణలో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు.

తమిళనాడు నుంచి కర్నాటక మీదుగా మరట్వాడా వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. తమిళనాడు నుంచి కర్నాటక వరకు సముద్రమట్టం నుంచి 900మీటర్ల వరకు ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.

ఉపరితల ద్రోణి ప్రభావంతో మంచిర్యాల, జైశంకర్ భూపాల పల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో ఒకటి రెండు ప్రదేశాల్లో మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. రేపు(ఏప్రిల్ 10,2021), ఎల్లుండి(ఏప్రిల్ 11,2021) పొడి వాతావరణం ఏర్పడే చాన్సుంది.
కాగా, తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. నిన్న(ఏప్రిల్ 8,2021) అత్యధికంగా నిజామాబాద్ జిల్లా రెంజల్ లో 41.9 డిగ్రీలు.. ఆర్మూర్ లో ఇస్నాపల్లిలో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ శాతం అతి తక్కువగా ఆదిలాబాల్ లో 12శాతం నమోదైంది.