Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్‌.. భారీవర్షాలు కురిసే అవకాశం!

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. రాష్ట్రంలో రెండు రోజులుగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. కొన్ని చోట్ల వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్‌.. భారీవర్షాలు కురిసే అవకాశం!

Weather update

Telangana heavy rains : తెలంగాణకు రెయిన్ అలర్ట్.. రాష్ట్రంలో రెండు రోజులుగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. కొన్ని చోట్ల వర్షాలు కురిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో కొమరీన్‌ ప్రాంతంపై అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ తీరం వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొంచెం బలహీన పడింది. వీటి ప్రభావంతో మూడు రోజుల పాటు తెలంగాణలో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

వాతావరణ మార్పుల కారణంగా అకాల వర్షాలు కురిసి తెలంగాణలో రైతులు తీవ్రఇబ్బంది పడ్డారు. వరి ధాన్యం బస్తాలు చాలా చోట్ల తడిసిపోయాయి. పండిన పంట మార్కెట్‌కు వెళ్లాల్సిన సమయంలో వర్షం కురవడంతో రైతులు నష్టపోయారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

కర్నాటకలో వర్షం దంచికొట్టింది. జోరు వానకు బెంగళూరులో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. నీరు నిలువడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పీవీపురంలో 126 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇక బెంగళూరు సౌత్‌ జోన్‌లో అత్యధికంగా 134.5 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆర్‌ఆర్‌ నగర్‌, మహాదేవపురలోనూ వర్షంతో రోడ్లు చెరువులను తలపించాయి.
Read Also :  Corona Cases : దేశంలో కొత్తగా 12 వేల కరోనా కేసులు