చలి నుంచి చినుకు : తెలంగాణలో వర్షాలు 

  • Published By: veegamteam ,Published On : February 13, 2019 / 10:57 AM IST
చలి నుంచి చినుకు : తెలంగాణలో వర్షాలు 

హైదరాబాద్ : తెలంగాణను చలిగాలులు వణికిస్తున్నాయి. ఈ  క్రమంలో వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల రీత్యా  రాష్ట్రాన్ని చల్లని చినుకులు పలకరించనున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ వైపు నుంచి ..ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలులు చత్తీస్‌గఢ్-తెలంగాణ ప్రాంతంలో కలవనున్నాయి. ఈ క్రమంలో గురువారం  (ఫిబ్రవరి 14) అంటే వాలెంటైన్స డే రోజున  రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈ గాలుల కలయిక వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు కొనసాగుతునే ఉన్నాయి. సోమవారం రాత్రి  రాష్ట్రంలోని కొన్ని జిల్లాలైన మెదక్‌లో 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదిలాబాద్‌‌లో 16 డిగ్రీలు, నిజామాబాద్, రామగుండం, హకీంపేటలలో 19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.