Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు

తూర్పు పడమర ద్రోణి, ఈశాన్య మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌, దక్షిణ ఒడిశాల మీదుగా మధ్య బంగాళాఖాతంలోని దక్షిణ ఒడిశా తీరం వరకు సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని తెలిపింది.

Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు

Rains in Telangana : తెలంగాణలో నాలుగు రోజుపాటు వర్షాలు పడనున్నాయి. రాష్ట్రంలో జూలై 3వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం(జూన్30,2022) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

తూర్పు పడమర ద్రోణి, ఈశాన్య మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌, దక్షిణ ఒడిశాల మీదుగా మధ్య బంగాళాఖాతంలోని దక్షిణ ఒడిశా తీరం వరకు సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని తెలిపింది. మరోవైపు ఉత్తర ద్వీపకల్ప దేశమంతటా విస్తరించిన షీర్‌ జోన్‌ బుధవారం(జూన్29,2022) బలహీన పడినట్లు వెల్లడించింది.

Assan Rains: వర్షాలు.. వరదలతో.. అసోం అతలాకుతలం

దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షం తీవ్రత తగ్గి తేలిక పాటి వర్షాలు కురుస్తాయని వివరించింది. కాగా, గత 24 గంటల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా మినహా అన్ని జిల్లాల్లో వర్షాపాతం నమోదైంది. మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, నారాయణపేట, వికారాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వివరించింది.