Rain : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు

తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు పడనున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

Rain : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు

Ts.rain

Rains in Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు పడనున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు గత నెలలో బీభత్సం సృష్టించిన గులాబ్ తుపాన్‌ నుంచి తెలుగు రాష్ట్రాలు ఇంకా కోలుకోకముందే.. మరో తుపాను ముంపు పొంచి ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. అల్పపీడనం మరింతగా బలపడి..తుపానుగా మారే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఈ తుపానుకు జావద్‌గా నామకరణం చేశారు. జావద్ తుపాను.. పశ్చిమవాయువ్య దిశగా ప్రయాణించి…నాలుగైదు రోజుల్లో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీరానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. 13 లేదా 14న తీరం దాటే అవకాశం ఉందని ప్రస్తుతానికి అంచనాలున్నాయి.

Heavy Rain : హైదరాబాద్‌లో భారీ వర్షం..నాలాలో వ్యక్తి గల్లంతు..రక్షించిన రెస్క్యూ టీమ్

గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు శివార్లలో కురిసిన కుండపోతకు.. జనజీవనం స్తంభించిపోయింది. అప్పటికే ఇళ్లకు చేరుకోవాల్సిన మార్గమధ్యంలో గంటల తరబడి వేచిచూశారు. తడచుకుంటూ ట్రాఫిక్‌లోనే బయల్దేరినవారు విసుగెత్తిపోయారు. ట్రాఫిక్‌ రద్దీ అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగింది. నిన్న సాయంత్రం పొడి వాతావరణయే ఉంది. కానీ రాత్రి 7.30, 8 గంటలకు చిన్నగా పడ్డ వర్షం ఆ తర్వాత ఉధృతమైంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేట్‌లో కార్డు స్థాయిలో 13.68 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

సరూర్‌నగర్‌ మండలం లింగోజిగూడ 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుర్మగూడలో 10 సెంటీమీటర్లు, మహేశ్వరం మండలం పారిశ్రామిక ప్రాంతంలో 9.03, హయత్‌నగర్‌ మండలం సౌత్‌ హస్తినాపురం ప్రాంతంలో 8.83 సెంటీమీటర్లు రెయిన్‌ఫాల్ రికార్డయ్యింది. మలక్‌పేటలో 8.7, సరూర్‌నగర్‌లో 8.6, కంచన్‌బాగ్‌లో 8.4, బహదూర్‌పురాలో 8.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మేడ్చల్‌ జిల్లా ఉప్పల్‌ మండలం మారుతినగర్‌లో 8.5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి అల్మాస్‌గూడ చెరువు కట్ట తెగింది. దీంతో సమీపప్రాంతాల్లోని జనావాసాలను వరద నీరు ముంచెత్తింది.