Telangana : తెలంగాణలో వరుసగా ఐదు రోజులపాటు వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Telangana : తెలంగాణలో వరుసగా ఐదు రోజులపాటు వర్షాలు

Telangana

Telangana : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ర్టంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

అలాగే సోమవారం ఉదయం నుంచి ఆగస్టు మంగళవారం ఉదయం వరకు.. ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపంది.

మంగళవారం ఉదయం నుంచి ఆగస్టు బుధవారం వరకు కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

బుధవారం ఉదయం నుంచి ఆగస్టు గురువారం ఉదయం వరకు కొమ్రంభీమ్ అసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముంది.