Heavy Rains In Telangana : ఈ నెల 9 వరకు తెలంగాణలో వానలు.. నేడు పలు జిల్లాలో భారీ వర్షాలు

తెలంగాణకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ద్రోణి కోస్తాంధ్ర తీరం నుంచి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా తూర్పు మధ్యప్రదేశ్‌ వరకు కొనసాగుతూ సముద్ర మట్టానికి 3.1కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించింది.

Heavy Rains In Telangana : ఈ నెల 9 వరకు తెలంగాణలో వానలు.. నేడు పలు జిల్లాలో భారీ వర్షాలు

Heavy Rains in Telangana

Heavy Rains In Telangana : తెలంగాణకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ద్రోణి కోస్తాంధ్ర తీరం నుంచి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా తూర్పు మధ్యప్రదేశ్‌ వరకు కొనసాగుతూ సముద్ర మట్టానికి 3.1కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించింది.

దీని ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 9 వరకు వర్షాలు కురవవచ్చని పేర్కొంది.

Telangana Rains : భారీ నుంచి అతి భారీ వర్షాలు.. తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మరో మూడు రోజులు వానలు

హనుమకొండ జిల్లాలో నిన్న రాత్రి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వరంగల్‌ నగరంలోని ఉర్సు రంగలీలా మైదానంలో దసరా ఉత్సవాలకు హాజరైన ప్రజలు వర్షం కారణంగా ఇబ్బందిపడ్డారు. గత నెలలో కురిసిన వర్షాలతో ఇప్పటికే జిల్లాల్లోని చెరువులు పూర్తి స్థాయిలో నిండాయి. భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరిగాయి.

మెట్ట పంటలకు మాత్రం పక్షం రోజుల నుంచి పదును లేకుండా పోయింది. ఈ వర్షంతో పత్తి, వేరుశనగ, మక్కజొన్న పంటలకు ప్రాణం వచ్చినట్లయింది. భారీ వర్షం కురిస్తే మాత్రం పత్తి పంటలకు తీవ్ర నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.