ఈరోజు, రేపు తెలంగాణలో వర్షాలు

ఈరోజు, రేపు తెలంగాణలో వర్షాలు

నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు , రేపు అక్కడక్కడ తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ వరకూ ఉత్తర-దక్షిణ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వలన కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.