Komatireddy RajGopal Reddy: తెరాస ప్రభుత్వంపై ధర్మయుద్ధం ప్రకటించా.. ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా.. స్పీకర్‌కు అందజేత

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సోమవారం ఉదయం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసిన రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను అందజేశారు.

Komatireddy RajGopal Reddy: తెరాస ప్రభుత్వంపై ధర్మయుద్ధం ప్రకటించా.. ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా.. స్పీకర్‌కు అందజేత

Rajagopal Reddy

Komatireddy RajGopal Reddy: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సోమవారం ఉదయం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసిన రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను అందజేశారు.  అనంతరం గవర్నర్ తమిళిసైను కలిసేందుకు రాజగోపాల్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. అంతకుముందు రాజగోపాల్ రెడ్డి గన్ పార్కులో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వంపై, మరోవైపు టీపీసీసీ ప్రెసిడెంట్ పై విమర్శలు చేశారు.

Rajagopal Reddy resign : రేపే ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా..ఈనెల 21న బీజేపీలో చేరిక!

తెరాస ప్రభుత్వంపై ధర్మయుద్ధం ప్రకటించానని, దీనిలో తెలంగాణ, మునుగోడు ప్రజలు గెలుస్తారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. అరాచక, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తన రాజీనామా అంశం ముందుకు వచ్చిందని అన్నారు. కేసీఆర్ చేతిలో చిక్కిన తెలంగాణ తల్లిని కాపాడుకోవాలని అన్నారు. తనపై సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నేను మునుగోడు అభివృద్ధికోసమే రాజీనామా చేశానంటూ స్పష్టం చేశారు.

Rajagopal Reddy Resignation : మేడం సోనియా.. అవమానాలు భరిస్తూ ఉండలేను

టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపైనా రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి భాష విని తెలంగాణ సమాజం తలదించుకుందని, జైలుకెళ్లిన వ్యక్తులు మాట్లాడితే ప్రజలు నమ్మరని రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి పార్టీ అధ్యక్షుడని, సీఎం అవుతారంట అంటూ వ్యాఖ్యానించారు. డబ్బులిచ్చి పదవులు తెచ్చుకున్నవాళ్లు.. ఏ త్యాగం చేయకుండా, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనకుండా ఇప్పుడు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. కోమటిరెడ్డి సోదరులను తిట్టిన భాష విన్న తర్వాత అందరూ ఆలోచించాలని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇదిలాఉంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన విషయం విధితమే. త్వరలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21న ఢిల్లీలో అమిత్ షా లేదా జేపీ నడ్డాల సమక్షంలో ఆయన బీజేపీ చేరుతారన్న ప్రచారం జరుగుతుంది.

MLA Rajagopal reddy resignation

MLA Rajagopal reddy resignation