Raju : రాజు నేరచరితుడే.. ఎల్బీనగర్ లో చోరీకి యత్నం

ఆరేళ్ళ బాలికపై అత్యాచారం చేసిన మరుసటి రోజు నిందితుడు రాజు ఆటో దొంగతనం చేసేందుకు యత్నించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Raju : రాజు నేరచరితుడే.. ఎల్బీనగర్ లో చోరీకి యత్నం

Raju (2)

Raju : హైదరాబాద్ సింగరేణి కాలనీలో గత గురువారం రాత్రి ఆరేళ్ళ పాపపై అత్యాచారానికి పాల్పడి హత్యచేసిన నిందితుడు రాజుకు నేరచరిత్ర ఉన్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. రెండు సార్లు ఆటో దొంగతనాలకు యత్నించినట్లు పోలీసులు గుర్తించారు. జనవరి 22న ఎన్టీఆర్ నగర్ కు చెందిన మహ్మద్ సాజిద్ అనే వ్యక్తి తన ఆటో తీసుకోని కొత్తపేట పండ్ల మార్కెట్ వద్దకు వచ్చాడు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో పండ్లమార్కెట్ ప్లాట్ ఫామ్ పై ఆటో పార్క్ చేసి ప్రార్థనకు వెళ్ళాడు. తిరిగి వచ్చి చూసేసరికి ఆటో ట్రాలీ కనిపించలేదు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు రాజును అరెస్ట్ చేశారు

Raju : ముగిసిన రాజు అంత్యక్రియలు.. ఆత్మహత్యగానే నిర్ధారణ

గురువారం రాత్రి బాలికను హత్యచేసిన రాజు శుక్రవారం యాకత్‌పురా రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ కూల్చివేత పనికి వెళ్లాడు. పని పూర్తి కాగానే అక్కడి నుంచి తోటి కూలీలతో కలిసి ఎల్బీ నగర్ చేరుకున్నాడు. అక్కడ ఆగిఉన్న ఆటోను దొంగిలించేందుకు ప్రయత్నించాడు. స్టార్ట్ చేస్తుండగా ఆటో డ్రైవర్ చూసి రాజుతో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు రాజు. అటు నుంచి ఉప్పల్ చేరుకున్నాడు. అక్కడి నుంచి వరంగల్ వైపు వెళ్ళాడు. అనేక సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ను పరిశీలించిన పోలీసులు ఈ విషయాలు గుర్తించారు. నగర పోలీసులు శుక్రవారం నుంచే రాజు ఫొటోను వైరల్‌ చేసి ఉంటే ఎల్బీ నగర్ లోనే రాజు దొరికేవాడు. కానీ ఫోటోలు విడుదల చేయడం కొద్దిగా ఆలస్యం కావడంతో నిందితుడు వరంగల్ వరకు వెళ్లగలిగాడు.

Read More : Health Minister : ‘వ్యాక్సిన్‌ తీసుకుని..ప్రధాని మోడీకి పుట్టినరోజు బహుమతిగా ఇద్దాం’

ఇక ఇదిలా ఉంటే స్టేషన్ ఘన్ పూర్ వద్ద రైలుకింద పది రాజు ఆత్మహత్య చేసుకున్నాడు.  మృతదేహానికి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ రిపోర్టులలో రాజు ఆత్మహత్య చేసుకున్నట్లుగా వెల్లడింది. ఇక పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు వరంగల్ లోనే రాజుకు అంత్యక్రియలు నిర్వహించారు.