Covid Restrictions : ఈసారి కూడా సాదాసీదాగా రంజాన్..ఎవరి ఇళ్లలో వాళ్లే నమాజ్

రంజాన్ పండుగ సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని ఇలా చేస్తే..వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Covid Restrictions : ఈసారి కూడా సాదాసీదాగా రంజాన్..ఎవరి ఇళ్లలో వాళ్లే నమాజ్

Happy Ramadan

Ramadan Festival 2021 : కరోనా మహమ్మారి వల్ల కనీసం ప్రజలు సంతోషంగా పండుగలు నిర్వహించుకోలేని స్థితి నెలకొంది. గత సంవత్సరం సీన్స్ మళ్లీ రిపీట్ అవుతున్నాయి. లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతుండడం..వేలాదిగా ప్రజలు చనిపోతుండడంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో ఈసారి కూడా రంజాన్ పండుగను సాదాసీదాగా నిర్వహించుకోవాల్సి వస్తోంది.

2021, మే 13వ తేదీ ముస్లీంలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ పండుగ. ఈ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఓల్డ్ సిటీలో ప్రస్తుతం పూర్తిగా లాక్ డౌన్ కొనసాగుతోంది. సామూహిక ప్రార్థనలకు అనుమతిని నిరాకరించారు. ఎవరి ఇళ్లలో వాళ్లే నమాజ్ చేసుకోవాలని సూచించారు. ఈద్గాలో మాత్రం ఇమామ్ సమక్షంలో నలుగురికి మాత్రమే అనుమతినివ్వనున్నారు.

రంజాన్ పండుగ సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని ఇలా చేస్తే..వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ పండుగ. ఈ సంవత్సరం శుక్రవారం పండుగ రావడంతో ముస్లిం సోదరులు ఎంతగానో సంతోషించారు. కానీ కరోనా వీరి ఆనందంపై నీళ్లు చల్లింది. ఈద్ ముబారక్ అనేది ఫోన్లు, సోషల్ మీడియా ద్వారా తమ కుటుంబసభ్యులకు, స్నేహితులకు, ఇతరులకు తెలియ చేసే పరిస్థితి నెలకొంది. పాతబస్తీలో సామూహికంగా కలవడానికి వీల్లేదని పోలీసులు వెల్లడిస్తున్నారు.