భవిష్యవాణి : కరోనా వైరస్..చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన స్వర్ణలత

10TV Telugu News

రాబోయే రోజుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి..తనకు ఏమాత్రం సంతోషంగా లేదు..రాబోయే రోజుల్లో కష్టాలు ఉంటాయి..ఎంత జాగ్రత్తగా ఉంటే..అంత మంచిది..అంటూ స్వర్ణలత హెచ్చరించారు. సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి బోనాల సందర్భంగా 2020, జులై 13వ తేదీ సోమవారం రంగం కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా కరోనా వైరస్, ఇతరత్రా వాటిపై భవిష్యవాణి వినిపించారు. ఎవరి చేసుకున్న వారు చేసుకున్నదే కదా..మీరే చేసుకున్నారు…సంతోషం లేదు..ఎంతగానో దు:ఖిస్తున్నా..ప్రజలను కాపాడుకుంటా..రాబోయే రోజుల్లో చాల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు.

రాబోయే రోజులు..కష్టాలు ఉంటాయి. ఎంత జాగ్రత్తగా ఉంటే..అంత మంచిది.. తప్పనిసరిగా అనుభవించాల్సిందేనన్నారు. ఐదు వారాలు సాకలు పోసి హోమాలు జరపాలి..భక్తి భావంతో కొలిస్తేనే..నేను కాపాడుతానన్నారు. గంగా దేవికి యాగాలు జరపాలని సూచించారు.

Read Here>>తెలంగాణలో కరోనా..1269 కేసులు

×