TRS Politics : మంత్రి సబితా ఇంద్రారెడ్డి భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు..చెరువులు,స్కూల్ స్థలాలను కూడా వదలటంలేదు..

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో టీఆర్ఎస్ లో విభేదాలు మరోసారి గుప్పుమన్నాయి. మంత్రి వర్సెస్ మాజీ ఎమ్మెల్యేల మధ్య విభేధాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో మంత్రి సబితాఇంద్రారెడ్డిపై టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి సబితా కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని..చెరువులను..స్కూల్ స్థలాలను కూడా వదలకుండా సబితా కబ్జాలు చేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

TRS Politics : మంత్రి సబితా ఇంద్రారెడ్డి భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు..చెరువులు,స్కూల్ స్థలాలను కూడా వదలటంలేదు..

Trs Politics In Rangareddy District

TRS Politics in rangareddy district : రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో టీఆర్ఎస్ లో విభేదాలు మరోసారి గుప్పుమన్నాయి. మంత్రి వర్సెస్ మాజీ ఎమ్మెల్యేల మధ్య విభేధాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో మంత్రి సబితాఇంద్రారెడ్డిపై టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి సబితా కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని..చెరువులను..స్కూల్ స్థలాలను కూడా వదలకుండా సబితా కబ్జాలు చేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

మీర్పేట్ ప్రాంతాన్ని మంత్రి సబిత నాశనం చేస్తున్నారని అన్నారు. మీర్పేట మంత్రాల చెరువును ఆయన పరిశీలించారు. మంత్రి సబిత కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని..

చెరువులు, స్కూల్ స్థలాలను వదలడం లేదని ఆరోపించారు. ఆఖరికి వక్ఫ్ బోర్డు భూముల్ని కూడా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.ఈ అరాచకాన్ని తాను చూస్తు ఊరుకోను అంటూ హెచ్చరించారు. వాటిని కాపాడటానికి అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అంటూ తీగల కృష్టారెడ్డి స్పష్టం చేశారు. నేను తప్పు చేస్తే నాపై చర్యలుతీసుకోండి..నాకు మంత్రిపై ఎటువంటి కక్షాలేదని తీగల స్పష్టం చేశారు. చెరువలన్నింటిని కబ్జా చేసే మంత్రి సబిత తీరు పార్టీకి తీరని నష్టం కలిగింస్తుందనే నా ఆవేదన అంతా కానీ నాకు ఆమెపై ఎటువంటి విరోధం లేదని తీగల అన్నారు.

టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక సబిత ఎమ్మెల్యేగా గెలవలేదని..దీనికి సంబంధించి తాను సీఎం కేసీఆర్ తో మాట్లాడతానని తెలిపారు. కాగా..మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ లో విభేధాలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి.బడంగ్ పేట్ టీఆర్ఎస్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఇక తాజాగా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేనే మంత్రిపై ఆరోపణలు చేయడం గమనించాల్సిన విషయం. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన మంత్రి అయ్యారు సబిత. ఈక్రమంలో గత కొంతకాలంగా మంత్రి తీరుపై తీగల అసంతృప్తితో ఉన్నారు.