HCU Prof Ravi Ranjan Suspend: థాయ్‌లాండ్ విద్యార్థినిపై అత్యాచార యత్నం .. HCU ప్రొఫెసర్ రవిరంజన్ సస్పెండ్

థాయ్ లాండ్ విద్యార్థినిపై అత్యాచార యత్నం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ..హెచ్ సీయూ ప్రొఫెసర్ రవిరంజన్ పై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. థాయ్ లాండ్ నుంచి హెచ్ సీయూలో ఉన్నత విద్యనభ్యసించటానికి వచ్చిన ఓ విద్యార్థినపై కన్నేశాడు హిందీ ప్రొఫెసర్ రవిరంజన్ ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఇప్పటికే పలువురు విద్యార్థినిలను వేధించిన కీచక ప్రొఫెసర్ ను సస్పండ్ చేసినట్లుగా రిజిస్ట్రార్ ప్రకటించారు.

HCU Prof Ravi Ranjan Suspend: థాయ్‌లాండ్ విద్యార్థినిపై అత్యాచార యత్నం .. HCU ప్రొఫెసర్ రవిరంజన్ సస్పెండ్

HCU Prof Ravi Ranjan Suspend

HCU Prof Ravi Ranjan Suspend :  థాయ్ లాండ్ విద్యార్థినిపై అత్యాచార యత్నం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ..హెచ్ సీయూ ప్రొఫెసర్ రవిరంజన్ పై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. కాగా థాయ్ లాండ్ నుంచి హెచ్ సీయూలో ఉన్నత విద్యనభ్యసించటానికి వచ్చిన ఓ విద్యార్థినపై కన్నేశాడు హిందీ ప్రొఫెసర్ రవిరంజన్. అదును కోసం వేచి చూశాడు.

ఈక్రమంలో రాత్రి 8 గంటల సమయంలో క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన సదరు విద్యార్థిని చూశారు ప్రొఫెసర్. అదే అదనుగా భావించి హిందీ బేసిక్స్ నేర్పిస్తానని విద్యార్ధినితో మాటలు కలిపాడు. అది నమ్మింది ఆమె. దీంతో ప్రొఫెసర్ ఆమోను కారులో తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడికి తీసుకెళ్లాక ఆమెకు మద్యం తాగించాడు. అలా ఆమెపై అసభ్యంగా ప్రవర్తిస్తు పిచ్చి పిచ్చిగా వ్యవహరించాడు. అది గుర్తంచిన ఆమె ప్రతిఘటించింది. అక్కడి నుంచి తప్పించుకోవటానికి యత్నించింది. దీంతో చేతికందిన ఆమె దొరకుండాపోతుందని భావించిన కీచక ప్రొఫెసర్ రవి రంజన్ ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించటంతో కొట్టాడు. ఆమె అతనుంచి తప్పించుకుని బయటపడింది. వెంటపడ్డ ప్రొఫెసర్ ఆమెను పదే పదే కొడుతు తిరిగి యూనివర్శిటికి తీసుకొచ్చాడు. అక్కడ కూడా ఆమెను పదే పదే అసభ్య పదజాలంతో తిట్టాడు. నీ అంతు చూస్తానంటూ బెదిరించాడు.

దీంతో ఆమె తనపై అత్యాచారం యత్నం చేశాడంటూ హిందీ ప్రొఫెసర్ రవిరంజన్ పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులుదర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో రవిరంజన్ ఇప్పటికే పలువురిపై అత్యాచారం యత్నం చేసినట్లుగా ముగ్గురిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా తెలిసింది.

థాయ్ లాంట్ విద్యార్థినిపై ప్రొఫెసర్ రవిరంజన్ అత్యాచార యత్నం చేసినట్లుగా తెలుసుకున్న విద్యార్థి సంఘాలు హెచ్ సీయుకు చేరుకుని ఆందోళన చేపట్టారు. చదువుకోవటానికి వచ్చిన విద్యార్థినిపై ఇటువంటి దారుణాలకు పాల్పడే రవిరంజన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తే ఆందోళన చేపట్టగా ఎట్టకేలకు హిందీ ప్రొఫెసర్ రవిరంజన్ పై సస్పెండ్ వేటు వేసినట్లుగా రిజిస్ట్రార్ ఆందోళన చేస్తున్న విద్యార్ధులకు తెలిపారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఈక్రమంలో రవిరంజన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.