కొమ్మేపల్లి అడవుల్లో మూషిక జింక

  • Published By: nagamani ,Published On : October 7, 2020 / 03:55 PM IST
కొమ్మేపల్లి అడవుల్లో మూషిక జింక

rare mouse deer: ఖమ్మం జిల్లాలో అరుదైన మూషిక జింక పిల్ల కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సత్తుపల్లి జీవీఆర్ ఓపెన్ కాస్ట్ ప్రభావిత ప్రాంతమైన కొమ్మేపల్లి అటవీ ప్రాంతంలో సింగరేణి కార్మికులకు ఇది దొరికింది. దాన్ని చూసి ఆశ్చర్యపోయినవారు వెంటనే దీనిని అటవీశాఖ అధికారులకు అందజేశారు. అచ్చు జింక చర్మం ఉండే డిజైన్ తో ఉండే ఈ మూషికంలాంటి ఆ జింకపిల్ల వయసు మూడు నెలలు ఉంటుందని అధికారులు తెలిపారు.



ఈ వింత జింకను స్వాధీనం చేసుకుని దానికి పరీక్షలు నిర్వహించి తిరిగి కిన్నెరసాని అటవీప్రాంతంలో జాగ్రత్తగా వదిలిపెట్టారు. ఇలాంటి ముషిక జింకలు చాలా అరుదుగా కనిపిస్తాయని అధికారులు తెలిపారు. అంతరించిపోతున్న జాతుల్లో మూషిక జింక కూడా ఒకటని, ఇది ఎక్కువగా దట్టమైన అటవీ ప్రాంతాల్లోనే సంచరిస్తుందని అధికారులు తెలిపారు. అలాంటిది ఈ అటవీ ప్రాంతంలో ఇది కనిపించడం అరుదైన విషయమేనని అన్నారు.


సత్తుపల్లి జీవీఆర్ ఓపెన్ కాస్ట్ సమీపంలోని కొమ్మేపల్లి అటవీ ప్రాంతంలో ఓ టిప్పర్ డ్రైవర్‌కు ఇది కనిపించగా..సింగరేణి కార్మికులు దాన్ని అధికారులకు అందజేయటంతో అధికారులు దాన్ని తిరిగి అడవిలో జాగ్రత్తగా వదిలిపెట్టారు. ఇటువంటి జింక ఎలుకలు ఎక్కువగా దట్టమైన అటవీ ప్రాంతాల్లోనే సంచరిస్తుంటాయని తెలిపారు. కానీ కొమ్మెపల్లిలో ఈ జింక ఎలుక కనిపించడం వింతగా ఉందని తెలిపారు. అంతరించే జాతుల్లో ఉన్న ఈ మూషిక జింక కనిపించడంపై అటవీ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.