KTR Rats Notes : రూ.2లక్షల డబ్బు కొరికేసిన ఎలుకలు, బాధితుడికి అండగా నిలిచిన మంత్రి కేటీఆర్

మహబూబాబాద్ జిల్లా ఇంద్రానగర్ తండాకు చెందిన రెడ్యానాయక్ అనే కూరగాయల వ్యాపారి దాచుకున్న రూ.2 లక్షల నగదును ఎలుకలు కొరికేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. దీనిపై ఆయన వెంటనే స్పందించారు.

KTR Rats Notes : రూ.2లక్షల డబ్బు కొరికేసిన ఎలుకలు, బాధితుడికి అండగా నిలిచిన మంత్రి కేటీఆర్

Ktr Rats Notes

KTR Rats Notes : మహబూబాబాద్ జిల్లా ఇంద్రానగర్ తండాకు చెందిన రెడ్యానాయక్ అనే కూరగాయల వ్యాపారి దాచుకున్న రూ.2 లక్షల నగదును ఎలుకలు కొరికేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. దీనిపై ఆయన వెంటనే స్పందించారు. ఈ ఘటన గురించిన పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కూరగాయల వ్యాపారి రెడ్యానాయక్ నుంచి ముక్కలైన కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకుని, తగిన ఆర్థికసాయం అందించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ను కేటీఆర్ ఆదేశించారు.

గిరిజిన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా స్పందించారు. రెడ్యానాయక్ తో ఫోన్ లో మాట్లాడి ఓదార్చారు. డబ్బు విషయంలో ప్రభుత్వం తగిన సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. చికిత్సపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఇరువురు మంత్రుల ఆదేశాలతో అధికారులు బాధితుడు రెడ్యానాయక్ ను కలిశారు. ఎలుకలు కొరికేసిన కరెన్సీ నోట్లను పరిశీలించారు.

రెడ్యా నాయక్‌ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, అతని ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చికిత్స కోసం కొంత కాలంగా డబ్బు దాచుకుంటూ వస్తున్నాడు. కానీ, అతడిని దురదృష్టం వెంటాడింది. ఇంతకాలం కష్టపడి దాచుకున్న సొమ్ము రూ.2లక్షలు ఎలుకలు కొరికేశాయి. దీంతో అతడు షాక్ తిన్నాడు. ఎలుకలు కొరికిన నోట్లను చూసి కన్నీరుమున్నీరయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో అందరిని కదిలించింది. తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అయ్యో పాపం అని నెటిజన్లు జాలి చూపారు. చివరికి ఈ వ్యవహారం మంత్రులను చేరింది. వారు బాధితుడికి అండగా నిలిచారు.