Pothireddypadu: రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమ ప్రాజెక్టు – వేముల ప్రశాంత్

ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తరలిస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటి ప్రవాహం తగ్గిపోతుందని, ప్రాజెక్ట్ కింద సాగుచేసుకునే రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు.

Pothireddypadu: రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమ ప్రాజెక్టు – వేముల ప్రశాంత్

Pothireddypadu

Pothireddypadu: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు అక్రమంగా నీటిని తరలించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు తెలంగాణ రోడ్డు, భవనాల శాఖామంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమ ప్రాజెక్టు అని దానిని నిబంధనలకు విరుద్దంగా నిర్మిస్తున్నారని తెలిపారు.

ప్రాజెక్టు సక్రమమైనది అయితే పనులు ఆపాలని కృష్ణాబోర్డు ఎందుకు ఆదేశించిందని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రశాంత్ రెడ్డి. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా రోజుకు 7.7 టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఇలా జరిగితే తెలంగాణ ప్రాజెక్టులకు నీరు రాదని అన్నారు.

నల్గొండ, ఖమ్మం, పాలమూరు రైతులు ఇబ్బందులు ఎదురుకోవలసి వస్తుందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం జీవో జారీచేసిన వెంటనే కృష్ణా రివర్స్ బోర్డుకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఆర్దీఎస్ కాలువ పనులు ఆపాలని నాలుగు ఉత్తరాలు రాశామని తెలిపారు ప్రశాంత్ రెడ్డి.

ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తరలిస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటి ప్రవాహం తగ్గిపోతుందని, ప్రాజెక్ట్ కింద సాగుచేసుకునే రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే హైదరాబాద్ కు తాగు నీటి ఎద్దడి వస్తుందని వివరించారు వేముల. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఆధారాలతో సహా కేంద్రానికి సీఎం కేసీఆర్ ఫిర్యాదు చేశారని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గ్రీన్ ట్రిబ్యునల్ కి అబద్దాలు చెబుతూ ఏపీ పనులు చేస్తుందిని ఆరోపించారు.

గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన స్టేని అమలు చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు ప్రశాంత్ రెడ్డి. రాయలసీమ ఎత్తిపోతలు, ఆర్డీఎస్ కుడికాలువ విస్తరణ పనులు ఆపాలి తెలిపారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు మాట్లాడుతున్న తీరు విడ్డురంగా ఉందని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.

ఏపీ వైఖరిని ఎన్నో వేదికలపై తెలంగాణ ప్రభుత్వం ఎండగడుతుందిని తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే పోతిరెడ్డిపాడు మొదలైందని గుర్తు వేశారు మంత్రి. ఇదే సమయంలోనే నీటి వాటాపై మాట్లాడారు.. నీటి వాటా విషయంలో కేంద్ర తాత్సారం చేస్తుందని అన్నారు. ఈ అంశంపై తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు సైలెంట్ గా ఉంటుందని ప్రశ్నించారు వేముల ప్రశాంత్ రెడ్డి