Goshamahal Nala Collapse : గోషామహల్ నాలా కూలిపోవడానికి కారణం అదేనా?

సుమారు 100 మీటర్ల దూరం నాలా కుంగిపోయి పూర్తిగా కూలిపోయింది. ఆ సమయంలో కూరగాయలు అమ్ముతున్న వ్యాపారులకు గాయాలయ్యాయి. నాలాపై రెండు మూడు సార్లు రోడ్డు వేయడంతో ఆ బరువుకి కూలిపోయి ఉంటుందని, జీహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణ లోపం కూడా స్పష్టంగా కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు.

Goshamahal Nala Collapse : గోషామహల్ నాలా కూలిపోవడానికి కారణం అదేనా?

Goshamahal Nala Collapse : గోషామహల్ నాలా కూలిన ఘటనలో పోలీసులు, డీఆర్ఎఫ్ బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నాలా కుంగిపోవడంతో అందులో ఇరుక్కుపోయిన కార్లను క్రేన్ల సాయంతో బయటకు వెలికితీశారు.

సుమారు 100 మీటర్ల దూరం నాలా కుంగిపోయి పూర్తిగా కూలిపోయింది. ఆ సమయంలో కూరగాయలు అమ్ముతున్న వ్యాపారులకు గాయాలయ్యాయి. నాలాపై రెండు మూడు సార్లు రోడ్డు వేయడంతో ఆ బరువుకి కూలిపోయి ఉంటుందని, జీహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణ లోపం కూడా స్పష్టంగా కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు.

Also Read..Dubai Lottery: దుబాయ్‌లో జాక్‌పాట్ కొట్టిన తెలంగాణ వాసి.. రూ.338తో లాటరీ టికెట్ కొంటే 33 కోట్ల ప్రైజ్‌మనీ

గోషామహల్ నియోజకవర్గంలో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోవడం కలకలం రేపింది. చక్నావాడిలో ఓ నాలాపై ఉన్న రోడ్డు కుంగిపోయింది. దాని వల్ల పెద్ద గుంత ఏర్పడగా అందులో కార్లు, ఆటోలు పడిపోయాయి.

ఆ ప్రాంతంలో సంత జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో పలు కూరగాయల దుకాణాలు కూడా ఆ గోతిలో పడిపోయాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేసి సహాయకచర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read..Nala Collapses in Hyderabad : గోషామహల్ చాక్నవాడిలో కుంగిన నాలా.. కుప్పకూలిన వాహనాలు,షాపులు, పలువురికి గాయాలు..

రోడ్డు కుంగిపోవడానికి కారణాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. నగరంలో పురాతనమైన నాలాలు ఉన్నాయని, ఇష్టానుసారం ఆక్రమణలకు పాల్పడడం కూడా ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నాయని చెప్పారు. ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపడతామన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం వల్లే నాలా కుంగిపోయిందని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. స్థానికంగా ఉన్న నాలాల అభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్ కు ఎన్నిసార్లు లేఖలు రాసినా నిధులు ఇవ్వలేదన్నారు. అందువల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు. కుంగిపోయిన నాలాను పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాజాసింగ్.