హైదరాబాద్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టు

హైదరాబాద్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ లో వ్యభిచారం చేస్తూ మరో ముఠా గుట్టు బయటపడింది. కరోనా భయం పక్కకుపెట్టి సుల్తాన్ బజార్ లోని ఓ ప్రైవేట్ లాడ్జీలో జరుగుతున్న వ్యవహారం వెలుగుచూసింది. ఇద్దరు యువతులతో పాటు వారితో ఉన్న ఇద్దరు విటులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.



ఆదిలాబాద్‌కు చెందిన రఫీక్‌ అనే వ్యక్తి ఈ దందా చేస్తున్నట్లుగా గుర్తించారు. కోఠిలోని పూత్లిబౌలి చౌరస్తా వద్ద ఆదిలాబాద్‌ లాడ్జీ పేరుతో కొంత కాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందిందని సీఐ సుబ్బిరామిరెడ్డి వెల్లడించాడు.



సోమవారం రాత్రి 9 గంటలకు సుల్తాన్‌బజార్ ఎస్సై లింగారెడ్డి సిబ్బందితో కలిసి లాడ్జీపై దాడి చేసి ఇద్దరు యువతులు, ఇద్దరు విటులతోపాటు లాడ్జీ సూపర్ వైజర్ రవిని అరెస్టు చేశారు. ఈ మేరకు వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.