నాగర్ కర్నూల్ లో రెడ్ జోన్ తొలగింపు

నాగర్ కర్నూల్ లో రెడ్ జోన్ తొలగింపు

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రెడ్ జోన్ తొలగించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. ప్రజలు పూర్తి స్థాయిలో నిబంధనలను పాటిస్తూ సహకరించాలని కోరారు. జిల్లా కేంద్రంలో (ఏప్రిల్ 3, 2020) నుంచి రెడ్ జోన్ అమలు పరిచారు. నిర్దిష్ట ప్రణాళికతో కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు విజయం సాధించారని వెల్లడించారు.

గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కరోనా బాధితులు ( ఏప్రిల్ 28, 2020)వరకు ఐసోలేషన్ లో ఉంచి మరోసారి పరీక్షలు నిర్వహించిన తర్వాత నెగెటివ్ వస్తేనే ఇంటికి పంపిస్తామని చెప్పారు. హోంక్వారంటైన్ లో ఉన్నవారు ఇంటి బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  జిల్లా పౌరులందరూ లాక్ డౌన్ కు సహకరించి జిల్లాను కరోనా విముక్తి చేయడానికి దోహదం చేయాలన్నారు.