Harish Rao : 2 డోసుల మధ్య వ్యవధి తగ్గించండి, బూస్టర్ డోసుకు అనుమతివ్వండి
కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 4 నుంచి 6 వారాల వ్యవధిలో రెండో డోసుకు అనుమతి ఇవ్వాలన్నారు. అలాగే హెల్త్ కేర్ వర్కర్లకు, ఫ్రంట్ లైన్..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్రానికి లేఖ రాశారు. కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 4 నుంచి 6 వారాల వ్యవధిలో రెండో డోసుకు అనుమతి ఇవ్వాలన్నారు. అలాగే హెల్త్ కేర్ వర్కర్లకు, ఫ్రంట్ లైన్ వారియర్లకు బూస్టర్ డోసు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
Lemon Juice : వేడి నీటితో నిమ్మరసం… ఆరోగ్యానికి మంచిదేనా?
కొవిషీల్డ్ రెండో డోసుకు 12 వారాల వ్యవధి ఉండటంతో సమస్యలు ఎదురవుతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. వ్యవధి ఎక్కువ ఉండటంతో రెండో డోసు వేయడం కష్టంగా మారిందన్నారు.
Android apps : స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరిక.. ఈ యాప్స్ యమ డేంజర్.. బ్యాంకు ఖాతాలు ఖాళీ
వలస కూలీలు మొదటి డోసు వేసుకున్న తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని చెప్పారు. వారిని గుర్తించి సెకండ్ డోస్ వేయడం చాలా కష్టంగా మారిందన్నారు. ముఖ్యంగా అంతర్రాష్ట్ర కూలీల విషయంలో ఇబ్బంది ఎక్కువగా ఉందన్నారు. అందువల్ల గతంలో మాదిరిగా రెండో డోసు వ్యవధిని 4 – 6 వారాలకు తగ్గించాలని హరీశ్ రావు కోరారు. గడువును కుదిస్తే రెండో డోస్ వేసుకునే వారి సంఖ్య పెరుగుతుందని చెప్పారు.
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులాగా విస్తరిస్తోంది. తాజాగా భారత్‌లోనూ ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరులో రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను గుర్తించినట్లు కేంద్రం శుక్రవారం అధికారిక ప్రకటన చేసింది.
హైదరాబాద్‌లోనూ ఒమిక్రాన్ కలకలం రేగింది. విదేశాల నుంచి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆమెను గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రికి తరలించి క్వారంటైన్లో ఉంచారు. ఆమె నుంచి శాంపిల్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. ఆమెకు సోకింది ఏ వేరియంట్ అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
కుత్బుల్లాపూర్ సమీపంలో ఉన్న రిడ్జ్ టవర్స్ కు చెందిన 36 ఏళ్ల మహిళ లండన్ నుంచి వచ్చింది. ఎయిర్ పోర్టులో నిర్వహించిన కొవిడ్ పరీక్షలో నెగెటివ్ అని తేలింది. అయితే ఆ తర్వాత రిపోర్ట్స్ ను పరిశీలిస్తే పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే జీడిమెట్ల పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రిడ్జ్ టవర్స్ అసోసియేషన్ కమిటీకి సమాచారం అందించారు. వెంటనే పోలీసులు కూడా అక్కడికి చేరుకుని విషయాన్ని సదరు మహిళకు వివరించి, టిమ్స్ కు తరలించారు. ఆమె తల్లిదండ్రులను హోమ్ క్వారంటైన్ లో ఉంచారు.
ఓవైపు ఒమిక్రాన్ భయాలు, మరోవైపు విదేశాల నుంచి వస్తున్న వారిలో బయటపడుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. జనాల్లో ఆందోళనను మరింత పెంచుతున్నాయి. తాజాగా విదేశాల నుంచి హైదరాబాద్ కి వచ్చిన ప్రయాణికుల్లో 12 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరంతా నిన్న, ఈరోజు కెనడా, యూకే, అమెరికా, సింగపూర్ నుంచి వచ్చారు. వీరందరిని టిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతేకాదు వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. అయితే వీరందరికీ అసింప్టొమేటిక్ లక్షణాలు ఉండటం గమనార్హం. వీరి రిపోర్టుల్లో ఒమిక్రాన్ నిర్ధారణ కాకపోతే హోం ఐసొలేషన్ కు పంపిస్తారు.
- గంటైనా పర్లా .. రిజిస్టర్ తెప్పించాల్సిందే
- Harish Rao: ప్రైవేట్ హాస్పిటల్స్‌లో అవసరం లేకున్నా.. ఆపరేషన్లు చేస్తున్నారు – హరీష్ రావు
- Harish Rao: సిద్దిపేట అంటే అభివృద్ధి.. అభివృద్ధి అంటే సిద్దిపేట – హరీశ్ రావ్
- Covid Vaccine wastage: చెత్తకుప్పలో కరోనా టీకాలు: విచారణకు ఆదేశించిన అధికారులు
- Harish Rao On Rahul Gandhi : ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాంగ్రెస్ నాశనం-రాహల్ గాంధీపై తీవ్ర విమర్శలు
1Virender Sehwag: “ఆ మ్యాచ్‌లు ఆడకపోతే పంత్‌ను పట్టించుకోరు”
2CoWIN: కొవిన్ అంటే కొవిడ్ ఒక్కదానికే కాదు..!!
3RBI: మూడేళ్లుగా రూ.2వేల నోట్ల ముద్రణ ఆపేయడానికి కారణం.. రద్దేనా
4IPL2022 Rajasthan Vs RCB : బెంగళూరుపై బట్లర్ బాదుడు.. ఫైనల్‌కు రాజస్తాన్
5Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
6IPL2022 RR Vs Bangalore : మళ్లీ రాణించిన రజత్ పాటిదార్.. రాజస్తాన్ ముందు మోస్తరు లక్ష్యం
7Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
8Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో అన్నెం సాయిపై మరో కేసు నమోదు
9Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
10Nara Lokesh On Scams : మహానాడు తర్వాత కుంభకోణాలు బటయపెడతా-నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
-
NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
-
ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్
-
Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?
-
Pilot loses Cool: రన్‌వేపైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!
-
Ram Charan: ఆ డైరెక్టర్‌కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?
-
Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
-
Major: మేజర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్
-
Love Jihad in Karnataka: కర్ణాటకలో మరో లవ్ జిహాద్ ఘటన: వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య