Gold Silver Price: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..

బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారం ఉదయం 6గంటల వరకు నమోదైన ధరల ప్రకారం చూస్తే నిన్నటితో పోల్చితే ఈరోజు బంగారం ధరల్లో రూ. 600 వ్యత్యాసం చోటు చేసుకుంది.

Gold Silver Price: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..

Gold Price

Gold Silver Price: బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారం ఉదయం 6గంటల వరకు నమోదైన ధరల ప్రకారం చూస్తే నిన్నటితో పోల్చితే ఈరోజు బంగారం ధరల్లో రూ. 600 వ్యత్యాసం చోటు చేసుకుంది. అయితే ఈ ధరల్లో మళ్లీ మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు ఉన్నాయి. ఉదయం 6గంటల వరకు నమోదైన బంగారం, వెండి ధరల వివరాలను పరిశీలిస్తే.. మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,350 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,650 గా ఉంది. నిన్నటి(బుధవారం)తో పోల్చితే 22 క్యారెట్ల బంగారంలో రూ. 600, అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం రూ. 660 మేర తగ్గుదల కనిపించింది.

వయస్సును తగ్గించే ఆరు ఆహార పదార్థాలు!

తెలుగు రాష్ట్రాలో బంగారం ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణాల్లో బంగారం ధరల్లో వ్యత్యాసం ఏమీలేదు. మూడు ప్రధాన పట్టణాల్లోనూ బంగారం ధరలు ఒకే విధంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 51,650గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47,550 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,870గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల(10 గ్రాములు) బంగారం ధర రూ. 47,350, అదేవిధంగా 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర 51,650గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 48,930, అదేవిధంగా 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 53,380 గా ఉంది.

Rs.2 crore Diamond In Andhra Pradesh : కర్నూలు జిల్లా ఎర్రగుడిలో రైతుకు దొరికిన రూ.2 కోట్ల విలువైన వజ్రం..

ఇదిలాఉంటే వెండి ధరల్లోనూ స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.58,700గా కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణాల్లో కిలో వెండి ధర రూ.64,200గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 58,700 చెన్నైలో కిలో వెండి ధర రూ. 64,200, బెంగళూరులో రూ. 64,200గా కిలో వెండి ధర ఉంది. అయితే ఈ ధరలు ఉదయం 6గంటలకు నమోదయ్యాయి. వీటిల్లో మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు ఉన్నాయి.