Teachers Transfers, Promotions : టీచర్ల బదిలీలు, పదోన్నతులకు షెడ్యూల్ విడుదల

తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది.

Teachers Transfers, Promotions : టీచర్ల బదిలీలు, పదోన్నతులకు షెడ్యూల్ విడుదల

Teachers Transfers, Promotions  : తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇదంతా పూర్తిగా ఆన్ లైన్ లోనే ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ నెల 28వ తేదీ నుంచి 30 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 4వ తేదీ నాటికి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ముగియనుంది.

ప్రభుత్వ ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మొత్తం 37 రోజుల్లో ముగియనుంది. మార్చి 5 నుంచి 19వ తేదీ వరకు అప్పీళ్లకు అవకాశం కల్పించనున్నారు. టీచర్ల నుంచి దరఖాస్తులు అందిన 15 రోజుల్లో అప్పీళ్లను పరిష్కరించనున్నారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలపై ఈ నెల 15న ఉపాధ్యాయ సంఘాలు, జేఏసీల సమక్షంలో మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి సమగ్రంగా చర్చించారు.

Telangana Government : టీచర్లకు తెలంగాణ సర్కార్ సంక్రాంతి కానుక.. బదిలీలు, ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్

చర్చలు సఫలం కావడంతో తాజాగా సీఎం కేసీఆర్ మార్గదర్శకాలు, ఆమోదం మేరకు పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు ముహూర్తం ఖరారు అయింది. రాష్ట్రంలో పదోన్నతులు, బదిలీలపై సాధారణ పరిపాలన శాఖ గతంలో నిషేధం విధించింది. ఈ మేరకు జీవో 91ను జారీ చేయగా ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ జీఐడీ జీవోను విడుదల చేసింది. నాలుగన్నరేళ్ల తర్వాత బదిలీలు, పదోన్నతలు ఓకే చెప్పింది.

ఈ బదిలీలకు విద్యాశాఖలో దాదాపు 90 వేల మంది టీచర్లు అర్హత సాధిస్తారు. మరోవైపు పదవీ విరమణకు ఇంకా మూడేళ్ల సర్వీస్ ఉన్నవారిని మాత్రం ఈ సారి బదిలీ చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పదవీ విరమణ వయస్సును 58 నుంచి 61 ఏళ్లకు పెంచడంతో ఈ సారి మూడేళ్ల సర్వీస్ మిగిలున్నా.. బదిలీ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.