Remdesivir : రెమిడెసివిర్‌కు ప్రాణాలను రక్షించే శక్తి లేదు, దాని మీద మోజు వద్దు

రెమిడెసివిర్‌ తో ప్రాణభయం ఏ విధంగానూ తగ్గదా? ప్రాణాలను రక్షించే శక్తి దానికి లేదా? దాని మీద మోజు చాలా తప్పా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. రెమిడెసివిర్‌ మెడిసిన్ గురించి పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Remdesivir : రెమిడెసివిర్‌కు ప్రాణాలను రక్షించే శక్తి లేదు, దాని మీద మోజు వద్దు

Remdesivir

Remdesivir : రెమిడెసివిర్‌ తో ప్రాణభయం ఏ విధంగానూ తగ్గదా? ప్రాణాలను రక్షించే శక్తి దానికి లేదా? దాని మీద మోజు చాలా తప్పా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. రెమిడెసివిర్‌ మెడిసిన్ గురించి పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

”అంతర్జాతీయ స్థాయిలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సాలిడారిటీ ట్రయల్ జరిగింది. దాని మెయిన్ స్టీరింగ్ గ్రూప్ లో నేను సభ్యుడిని. నేను కచ్చితంగా చెప్పగలను. అంతర్జాతీయ స్థాయిలో అనేక దేశాల్లో ట్రయల్స్ జరిగాయి. అందులో తేలింది ఏంటంటే.. రెమిడిసివర్ వల్ల ప్రాణ భయం ఏ విధంగానూ తగ్గదు. అంటే ప్రాణాలను రక్షించే శక్తి దానికి లేదు. అమెరికాలో ఇంతకన్నా చిన్నస్థాయిలో ఒక ట్రయల్ జరిగింది. ఆ ట్రయల్ లో ప్రాణాపాయం తగ్గుతుందా లేదా అనేది చూడాలని అనుకున్నారు.

దాని రుజువు కనిపించ లేదు కాబట్టి వాళ్లు వేరే విధంగా అనలైజ్ చేశారు. దానివల్ల హాస్పటలైజేషన్ సమయం తగ్గుతుంది అంటే రికవరీ సమయం తగ్గుతుందని. కానీ, అందులోనూ కొన్ని లొసుగులు ఉన్నాయి. వారు చేసిన ట్రయల్స్ లో సంఖ్య తక్కువ. కాబట్టి, ఆ ట్రీట్ మెంట్ గ్రూప్ లో, కంపారిజన్ గ్రూప్ లో కొన్ని తేడాలు వచ్చాయి. కంపారిజన్ గ్రూప్ లో ఎక్కువమంది ఆక్సిజన్ మీద, వెంటిలేటర్ మీద ఉన్నప్పుడే ఆ ట్రయల్ లోకి ప్రవేశించారు. అందుకని వాళ్లు ఎక్కువ రోజులు హాస్పిటల్ లో ఉండటం సహజమే.

అందుకే రెమిడిసివర్ వల్ల ప్రాణభయం తగ్గుతుందని చెప్పడానికి ఏ నిదర్శనమూ లేదు. అందుకని, రెమిడిసివర్ వెనుకాల పరిగెత్తాల్సిన అవసరం లేదు. డాక్టర్ మీద నమ్మకం ఉంటే అవి వాడుకోవచ్చు. హాస్పిటల్ లో చేరిన రోగులకే వాడాలి కానీ ఇంట్లో అస్సలు వాడకూడదు. అందుకని రెమిడిసివర్ మీద మోజు చాలా తప్పు” అని డాక్టర్ శ్రీనాథ్ తేల్చి చెప్పారు.

సెకండ్ వేవ్‌లో కరోనా కోరలు చాస్తుండటంతో పాజిటివ్ బారిన పడిన వారి సంఖ్య పెరిగిపోతుంది. కరోనా రోగులకు ఇంజెక్షన్ చేసే రెమిడెసివర్ మెడిసిన్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. రెమిడెసివర్ బాగా పని చేస్తుందనే నమ్మకంతో కరోనా రోగులు దాని మీద పడ్డారు. అయితే ఆ ఇంజెక్షన్ రోగులకు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని కొందరు కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని హెటిరో కంపెనీ ఔట్‌లెట్‌ దగ్గర రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల కోసం కరోనా పేషెంట్ల బంధువులు బారులు తీరినా.. వారందరినీ పక్కనపెట్టి హెటిరో సిబ్బంది ఇంజక్షన్లను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.