Omicron: హైదరాబాద్‌లో మళ్లీ ఆంక్షలు.. వైరస్‌ హాట్‌స్పాట్‌లు గుర్తింపు

ప్రపంచవ్యాప్తంగా కంగారుపెట్టేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్.. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా టెన్షన్ పెట్టేస్తుంది.

Omicron: హైదరాబాద్‌లో మళ్లీ ఆంక్షలు.. వైరస్‌ హాట్‌స్పాట్‌లు గుర్తింపు

Nagaram

Omicron: ప్రపంచవ్యాప్తంగా కంగారుపెట్టేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్.. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా టెన్షన్ పెట్టేస్తుంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడం కూడా ప్రభుత్వం అప్రమత్తం అవ్వడానికి ఓ కారణం.. మహానగరం హైదరాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. విదేశాల నుంచి వచ్చినవారిని పర్యవేక్షణలో పెడుతున్నారు.

ఈ క్రమంలోనే పర్యాటక ప్రాంతాల్లో కూడా నిబంధనలు కఠినతరం చేశారు. ట్యాంక్‌బండ్‌, చార్మినార్‌, నెక్లెస్ రోడ్ వద్ద ‘ఫన్‌డే’ వేడుకలను రద్దు చేసింది ప్రభుత్వం. పర్యాటకులపైనే కాదు.. సాధారణ పౌరులపై కూడా ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతి ఒక్కరూ మాస్క్‌ పెట్టుకోవాల్సిందేని, లేనివారికి స్పాట్ ఫైన్ రూ.వెయ్యి వెయ్యనున్నట్లు ఆదేశించింది ప్రభుత్వం.

జియాగూడ, మేకలమండి, మలక్‌పేట్‌ గంజ్, బేగంబజార్, పాతబస్తీ, మలక్‌పేట్, బేగంపేట్, మాదన్నపేట, గుడిమల్కాపూర్, సరూర్‌నగర్‌ మార్కెట్లపై మళ్లీ ఆంక్షలు విధించి, వైరస్‌కు హాట్‌స్పాట్‌లుగా వీటిని గుర్తించింది. ఫిజికల్ డిస్టెన్స్ నిబంధనలను కఠినంగా పాటించాలని, ఉల్లంఘించిన వ్యాపారులపై కేసులు నమోదు చేయనున్నట్లు హెచ్చరించింది.