Harish Rao : తెలంగాణలో క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు..! హైకోర్టు ఆదేశాలు గౌరవిస్తామన్న మంత్రి

ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో రాష్ట్రంలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు..

Harish Rao : తెలంగాణలో క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు..! హైకోర్టు ఆదేశాలు గౌరవిస్తామన్న మంత్రి

Harish Rao

Harish Rao : ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో రాష్ట్రంలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని మంత్రి చెప్పారు. కాగా, హైకోర్టు ఆర్డర్ కాపీ ఇంకా అందలేదన్న ఆయన, ఆర్డర్ కాపీ అందాక నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎయిర్ పోర్టులో టెస్టులు చేస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావు

కాగా.. బూస్టర్ డోస్, చిన్న పిల్లల వాక్సినేషన్ పై కేంద్రం ఇంకా స్పందించలేదని మంత్రి అన్నారు. ఇతర దేశాలు బూస్టర్ డోసు ఇవ్వాలని చెబుతున్నా కేంద్రం నుంచి మాత్రం ఎలాంటి స్పందనా లేదన్నారు. ఈ నెలాఖరులో ఢిల్లీలో ఆర్థిక శాఖ మంత్రులతో కేంద్రం నిర్వహించనున్న సమావేశానికి వెళ్లే అవకాశం ఉందని, అందులో వ్యాక్సినేషన్, కోవిడ్ కట్టడి చర్యలపై కేంద్రంతో మరోసారి చర్చిస్తామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి పెరిగింది. విదేశాల నుంచి వచ్చిన వారికే ఎక్కువగా ఈ వైరస్ వ్యాప్తి చెందిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.

January 1 Alert : జనవరి 1 నుంచి RBI కొత్త రూల్స్‌.. ఆన్‌లైన్ పేమెంట్లపై ఈ నిబంధనలు తప్పనిసరి..

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాల తరహాలో రాష్ట్రంలోనూ క్రిస్ మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకలపై ఆంక్షలు పెట్టాలని హైకోర్టు సూచించింది. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రజలు గుమిగూడకుండా ఉండేలా చూడాలని చెప్పింది.

ఎయిర్‌పోర్టులో ఉన్నట్టుగానే ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారికి సైత పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాలకు జనం వచ్చే సమయాల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నారని హైకోర్టు గుర్తు చేసింది. వేడుకల నిర్వహణ సమయంలో కూడా కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవడం లేదంది. బహిరంగ ప్రదేశాలకు వచ్చే వారంతా మాస్క్ తప్పనిసరిగా ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఒకవేళ మాస్క్ ధరించకపోతే భారీ జరిమానా విధించాలని కూడా ఆదేశించింది.

Best Smart Phones in India 2021 : డిసెంబర్ 2021లో రూ.25వేల లోపు బెస్ట్ మొబైల్ ఫోన్లు ఇవే..!

రాష్ట్రంలోకి ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే ప్రవేశించిందని… వేగంగా వ్యాప్తి చెందే ఈ వేరియంట్ పై అప్రమత్తంగా ఉండాలని కోర్టు తెలిపింది. కొత్త వేరియంట్ వ్యాప్తిని అరికట్టేందుకు పండుగలు, సెలెబ్రేషన్స్ పై ఆంక్షలు విధించాలని హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేసింది.

దుర్గాభాయ్ దేశముఖ్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ప్రభుత్వం తరఫున దుర్గాభాయ్ దేశముఖ్ ఆస్పత్రికి ఎలాంటి సాయం కావాలన్నా అందిస్తామన్నారు. ఆయుష్మాన్ భారత్ ని ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం చేశామన్న మంత్రి.. అవకాశం ఉంటే దుర్గాభాయ్ దేశముఖ్ ఆస్పత్రికి కూడా విస్తరిస్తామని హామీ ఇచ్చారు. మేఘ సంస్థ ఆస్పత్రులకు అనేక కోట్లు కేటాయించి ప్రజలకు సేవ చేస్తోందని మంత్రి ప్రశంసించారు. రూ.18 కోట్లతో నిమ్స్ లో క్యాన్సర్ చికిత్సకు అవసరమైన సదుపాయాలు మేఘ సంస్ధ కల్పించిందన్నారు. కోవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలో రోజుకు 35లక్షల లీటర్ల ఆక్సిజన్ ని ప్రభుత్వానికి మేఘ సంస్థ అందించిందని గుర్తు చేశారు మంత్రి హరీష్ రావు.

Exercise : వ్యాయామ సమయంలో గుండెపోటులకు కారణం?

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవరం రేపుతోంది. ఈ వేరియంట్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి పెరిగింది. నిన్న ఒక్కరోజే 14 కేసులు నమోదయ్యాయి. ఈ 14 మంది బాధితులు విదేశాల నుంచి వచ్చిన వారే. ఒమిక్రాన్ రోగులకు గచ్చిబౌలి టిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు.