Revanth Reddy : శశిథరూర్‌‌కు రేవంత్ రెడ్డి క్షమాపణలు, వివాదానికి ఫుల్ స్టాప్

రేవంత్ మాట్లాడిన ఆడియో క్లిప్‌ను కేటీఆర్‌ ట్వీట్‌ చేయడంతో.. శశిథరూర్‌కు రేవంత్‌ క్షమాపణలు చెప్పారు. రేవంత్ వ్యాఖ్యలను ఇతర కాంగ్రెస్ నేతలు తప్పు పట్టారు.

10TV Telugu News

Revanth Reddy And Shashi Tharoor : కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య ట్వీట్‌ వార్ ముదురుతోంది. శశిథరూర్‌పై రేవంత్‌ చేసిన వ్యాఖ్యల చుట్టూ ట్వీట్‌ వార్ కొనసాగుతోంది. రేవంత్ మాట్లాడిన ఆడియో క్లిప్‌ను కేటీఆర్‌ ట్వీట్‌ చేయడంతో.. శశిథరూర్‌కు రేవంత్‌ క్షమాపణలు చెప్పారు. రేవంత్ వ్యాఖ్యలను ఇతర కాంగ్రెస్ నేతలు తప్పు పట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదంటూ మనోజ్ తివారీ ట్వీట్ చేశారు. ఇదే అంశంపై స్పందించిన రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌.. ఒక తప్పు జరిగిందన్నారు. ఇక వదిలేద్దామంటూ మాణిక్కం ఠాగూర్ ట్వీట్ చేశారు.శశిథరూర్ ను గాడిద అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను కోడ్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Read More : Prince Philip వీలునామాకు సీల్ వేసిన కోర్టు.. 90 ఏళ్ల త‌ర్వాతే తెరవాలి!

ఆడియో క్లిప్ తో సహా పోస్ట్ చేశారు. మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ కి రీ ట్వీట్ చేశారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్. అవినీతి పరులు అయిన మీరు మా గురించి తప్పుడు ప్రచారం చేస్తారా మీపై వస్తున్న ఆరోపణలు తప్పుదోవ పట్టించడానికి శశిథరూర్ పేరుతో అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ రేవంత్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి మూలాలు ఆక్కడి నుంచే ఉన్నాయి.. కనుక నన్ను గాడిద అని సంబోధించారంటూ ఘూటు కామెంట్స్ చేశారు శశిథరూర్. రేవంత్ రెడ్డి తన మాటలు ఉపసంహరించుకోవాలని మనోజ్ తివారీ ట్వీట్ చేశారు. వెంటనే.. మరో ట్వీట్ చేశారు రేవంత్.

Read More : Hyderabad : ఇన్‌స్టాగ్రాంలో గంజాయి అమ్మకం

శశిథరూర్ తో మాట్లాడానంటూ ట్వీట్ లో వెల్లడించారు. శశిథరూర్ తో మాట్లాడటం జరిగింది. నా మాటలు విత్ డ్రా చేసుకుంటున్నాను. అలా మాట్లాడినందుకు చింతిస్తున్నాను. ఒక సీనియర్ నేతగా శశిథరూర్ అమూల్య సలహాలను తీసుకుంటాం.. అంటూ రేవంత్ ట్వీట్ లో తెలిపారు. దీనికి శశిథరూర్ కూడా స్పందించారు. రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. జరిగిన విషయాన్ని చింతిస్తున్నానంటూ అనుకోకుండా నోరు జారానని ఇక అందరం కలిసి పని చేద్దామన్నారని ట్వీట్ లో వెల్లడించారు. ఈ ఎపిసోడ్ లో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ రంగంలోకి దిగారు.  ఒక మిస్టేక్ జరిగింది.. ఇక వదిలేద్దాం ఠాగూర్ ట్వీట్ లో తెలిపారు. మీడియా తీరును ఠాగూర్ తప్పుబడుతూ మరో ట్వీట్ చేశారు.