Revanth Reddy: ఈ నెల 9న తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు: రేవంత్ రెడ్డి

తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 9న పెద్ద ఎత్తున పలు కార్యక్రమాలు నిర్వహించాలని తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. డిసెంబరు 9కి తెలంగాణలో ప్రత్యేక స్థానముందని, ఆ రోజు సోనియా గాంధీ పుట్టినరోజుతో పాటు అప్పటి యూపీఏ సర్కారు తెలంగాణను ప్రకటించిన రోజని చెప్పారు.

Revanth Reddy: ఈ నెల 9న తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు: రేవంత్ రెడ్డి

Revanth Reddy: తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 9న పెద్ద ఎత్తున పలు కార్యక్రమాలు నిర్వహించాలని తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. డిసెంబరు 9కి తెలంగాణలో ప్రత్యేక స్థానముందని, ఆ రోజు సోనియా గాంధీ పుట్టినరోజుతో పాటు అప్పటి యూపీఏ సర్కారు తెలంగాణను ప్రకటించిన రోజని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి మృతి చెందిన సభ్యులకు రూ.2 లక్షల బీమా అందేలా చూడాలని అన్నారు.

అలాగే, రాష్ట్రంలో సభ్యత్వ కార్డుల పంపిణీ చేపట్టాలని, రక్తదాన శిబిరాలు నిర్వహించాలని చెప్పారు. అంతకుముందు ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు సీబీఐ నుంచి అందిన నోటీసులపై స్పందించారు. ఆ విషయంలో తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. కవితను ఆమె నివాసం వద్దే విచారిస్తామని సీబీఐ ఎందుకు చెప్పిందని ప్రశ్నించారు.

Bangladesh vs India: రేపటి నుంచి వన్డే సిరీస్.. గాయంతో దూరమైన షమీ

ఆమె విషయంలో సీబీఐ ఈ ధోరణితో ఎందుకు ఉందని ఆయన నిలదీశారు. బీజేపీ-టీఆర్ఎస్ కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. కాగా, డిసెంబరు 9న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై అప్పటి యూపీఏ సర్కారు ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ దీక్ష వల్లే ఆ ప్రకటన వచ్చిందంటూ టీఆర్ఎస్ కూడా డిసెంబరు 9న పలు కార్యక్రమాలు చేపట్టనుంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..